Thursday, January 23, 2025

సార్ సాయిని పిలువండి. లెమనండి… మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్

- Advertisement -
- Advertisement -

మహబూబ్ నగర్: అకాల మరణం చెందిన, తెలంగాణ ఉద్యమ ప్రజా గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ వేద సాయిచంద్ పార్థివ దేహానికి సిఎం కెసిఆర్ ఘన నివాళులు అర్పించారు. గుర్రంగూడ లోని సాయిచంద్ నివాసానికి కెసిఆర్ చేరుకొని ఆయన భౌతిక కాయానికి పుష్పాంజలి ఘటించారు. సాయిచంద్ ను చూడగానే ముఖ్యమంత్రి కన్నీటి పర్యంతమయ్యారు. అనంతరం వారి కుటుంబ సభ్యుల వద్దకు చేరుకొని ఓదార్చారు. వారికి తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా…” సార్ సాయిని పిలువండి. లెమనండి..మీరు పిలిస్తే లేచివస్తాడు..సార్..” అంటూ హృదయ విదారకంగా రోదిస్తున్న సాయిచంద్ భార్య రజనీని ఓదార్చడం సిఎంకు కష్టంగా మారింది. దగ్గరకు వచ్చి రోదిస్తున్న సాయిచంద్ తండ్రిని సిఎం అక్కున చేర్చుకొని ఓదార్చారు. తాను ఉన్నానంటూ భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రులు హరీష్ రావు, మహమూద్ అలీ, సబితా ఇంద్రారెడ్డి, ఎంపి జోగినపల్లి సంతోష్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ లు గోరేటి వెంకన్న, పల్లా రాజేశ్వర్ రెడ్డి, మధుసూదనాచారి తదితర ప్రజాప్రతినిధులు పార్టీ నేతలు సిఎం కెసిఆర్ వెంట వచ్చి నివాళులర్పించారు.

Also Read: తాటతీస్తా, తోలుతీస్తా అనేది పవన్ మేనిఫెస్టో: కారమూరి

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News