Monday, January 20, 2025

లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఈ చిట్కా పాటించండి

- Advertisement -
- Advertisement -

న్యూస్‌డెస్క్: ఇంట్లో డబ్బు నిలవడం లేదా.. సంపాదించిందంతా ఖర్చయిపోతోందా.. కొత్త ఆదాయమార్గాలు కనపడడం లేదా.. చేస్తున్న ఉద్యోగంలో ఇబ్బందులు పడుతున్నారా.. ఈ రకమైన ఇబ్బందులు తొలగిపోవాలంటే లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడం ఒక్కటే మార్గం. అమ్మవారి అనుగ్రహకటాక్షం లభించడానికి ఈ చిన్న చిట్కా పాటిస్తే చాలు.. మీ సమస్యలు దూదిపింజల్లా ఎగిరిపోవడం తథ్యం.

ఇందుకు మీరు చేయవలసిందల్లా ఏమిటంటే.. రోజూ స్నానం చేసిన తర్వాత ఒక పాత్రలో మంచినీరు తీసుకుని అందులో కొద్దిగా పచ్చ కర్పూరం, చిటికెడు పూజకు వాడే పసుపును వేయండి. ఆ పాత్రను పూజమందిరంలో లక్ష్మీదేవి అమ్మవారి పటం ముందు ఉంచి అమ్మవారికి నిత్యపూజ చేయండి. మరుసటి రోజు ఆ పాత్రలోని నీటిని తులసి కోటలో పారబోసి మళ్లీ తాజా నీటిని పాత్రలో తీసుకుని మళ్లీ యథాప్రకారం పచ్చకర్పూరం, పసుపును అందులో వేసి పూజ గదిలో ఉంచండి.

ఇలా నిత్యం చేయడం వల్ల మీ గృహంలో సిరిపంపదలు విరాజిల్లడం తథ్యం. అమ్మవారి అనుగ్రహం వల్ల ఇంట్లో నెగటివ్ వైబ్రేషన్స్ పోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి. పెద్దగా ఖర్చుతో కూడుకున్న పని కూడా కాదు కాబట్టి దీన్ని వెంటనే మీరూ ఆచరణలో పెట్టి చూడండి.. ఫలితం వెంటనే మీకు అనుభవంలోకి వస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News