Monday, December 23, 2024

పెరుగుతున్న ఫుడ్ అలర్జీ సమస్యలు

- Advertisement -
- Advertisement -

పుడ్ అలర్జీ సమస్యలు రానురాను ఎక్కువగా ఉంటున్నాయి. మనం బయట తినే ఆహార పదార్ధాల వల్ల ఫుడ్ అలర్జీ వస్తుందని చెబుతుంటాం. కానీ కొన్నిసార్లు ఇంట్లో వండిన భోజనం కూడా ఫుడ్ అలర్జీకి కారణమవుతుంది. ఫుడ్ అలర్జీ సాధారణంగా ఆహారం తిన్న తర్వాత కొన్ని సెకన్లలో లేదా నిమిషాల్లో అభివృద్ధి చెందుతుంది. చిన్నమొత్తంలో ఆహారం తీసుకున్నా కడుపు సమస్యలు, దద్దుర్లు, వాయుమార్గాల వాపు, వంటి అలర్జీలకు కారణమవుతుంది. కొందరు వ్యక్తులు అనాఫిలాక్సిస్ అని పిలిచే ఆహార అలర్జీ వల్ల తీవ్రమైన లక్షణాలను అనుభవిస్తుంటారు.

ఫుడ్ అలర్జీ వల్ల సాధారణంగా దురద, ఎరుపు దద్దుర్లు, ముఖం, నోరు గొంతు లేదా శరీరం లోని ఇతర ప్రాంతాల్లో వాపు, మింగడం కష్టంగా ఉండడం, శ్వాస ఆడకపోవడం, తల తిరగడం, కళ్లు తిరగడం, వికారంగా ఉండడం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, అతిసారం, గవత జ్వరం, తుమ్ము లేదా కళ్లు దురద వంటి లక్షణాలు కనిపిస్తాయి. అనాఫిలాక్సిస్ అనే తీవ్రమైన అలర్జీ లక్షణాలు పరిశీలిస్తే నాలుక వాచిపోవడం, శ్వాస ఇబ్బంది, చాతీ బిగుసుకుపోవడం, మింగడం లేదా మాట్లాడడంలో ఇబ్బంది తలతిరగడం, మూర్ఛపోయినట్టు అనిపించడం మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. ఏ ఆహార పదార్ధాల వల్ల అలర్జీ వస్తుందో అని తెలిస్తే వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. యాంటీ హిస్టామైన్లు మందులు దురద లేదా దద్దుర్లను తగ్గిస్తాయి. ఫుడ్ అలర్జీ తక్షణ లక్షణాలను ఆక్యుపంచర్ వైద్యం తగ్గిస్తుంది.

Also Read: పోస్టుమాస్టర్‌ను ప్రియుడు చంపి… తల్లికి లోకేషన్ షేర్ చేశాడు…

పాలు , లేదా పాల ఉత్పత్తుల వల్ల మూడేళ్ల కన్నా తక్కువ వయసున్న పిల్లల్లో అలర్జీలు వస్తాయని ఓ అధ్యయనం ప్రకారం తేలింది. కొన్నేళ్లు దాటిన తర్వాత ఇది తగ్గిపోతుంది. డిజిటల్ జర్నల్ ది హెల్త్ లైన్ ప్రకారం దాదాపు 68 శాతం మంది పిల్లలు గుడ్ల ద్వారా అలర్జీని కలిగి ఉంటారని బయటపడింది. వారికి 16 సంవత్సరాల తర్వాత అలర్జీ తగ్గుతుంది. చాలా మందికి పల్లీలు కూడా పడవు. సోయా ఉత్పత్తులు వల్ల కొందరికి అలర్జీ వస్తుంది. గోధుమ లోని ప్రొటీన్లు అలర్జీకి కారణం కావచ్చు. ఉదరకుహర సమస్యలు ఉన్నవారు గోధుమలకు దూరంగా ఉండడం మంచిది. వంశ పారంపర్యంగా, వాతావరణ పరిస్థితుల కారణంగా కూడా అలర్జీలు రావచ్చు. నిమ్మరసంలో వ్యాధి నిరోధక శక్తిని పెంచే బూస్టింగ్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది పుడ్ అలర్జీని నివారిస్తుంది. గ్రీన్ టీ, క్యారట్ కరక్కాయ రసం, ఆముదం నూనె, విటమిన్ సి పదార్థాలు, వెనిగర్ వల్ల కూడా అలర్జీ తగ్గుతుంది. పాశ్చాత్య దేశాల్లో కొన్ని దశాబ్దాలుగా అలర్జీలు పెరుగుతున్నాయి. బ్రిటన్‌లో 7 శాతం మంది పిల్లలు, ఆస్ట్రేలియాలో 9 శాతం మంది పిల్లలు ఆహార అలర్జీకి గురవుతున్నారు. యూరప్‌లో పెద్దల్లో 2 శాతం మంది ఆహార అలర్జీ సమస్యల బాధితులవుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News