Sunday, December 22, 2024

అందాల ముద్దుగుమ్మను పెళ్లి చేసుకున్న జోమాటో సిఇఓ

- Advertisement -
- Advertisement -

ఫుడ్ డెలివరీ యాప్ జొమాటో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయక్కర్లేదు. ఈ యాప్ లేని సెల్ ఫోన్ ఉండదంటే అతిశయోక్తి లేదు. ఆర్డర్ ఇవ్వడమే తరువాయి, వేడివేడిగా ఆహార పదార్ధాలను డోర్ డెలివరీ చేసే జోమాటో గురించి తెలియనివారెవ్వరూ లేరు. ప్రముఖ వ్యాపారవేత్త దీపీందర్ గోయల్ నెలకొల్పిన జోమాటో లాభాల బాటలో దూసుకుపోతోంది.

తాజాగా దీపీందర్ ఓ అందాల సుందరిని పెళ్లాడాడు. 41 ఏళ్ల దీపీందర్ కు ఇది రెండో పెళ్లి. గతంలో తనకు ఢిల్లీ ఐఐటిలో పరిచయమైన కంచన్ జోషిని పెళ్లి చేసుకున్నాడు. దీపీందర్ తాజాగా మెక్సికోకు చెందిన గ్రేసియా మునోజ్ అనే మాజీ మోడల్ ను పెళ్లాడాడు. మునోజ్ సౌందర్య సాధనాల వ్యాపారంలో ఉంది. వీరిద్దరికీ నెలరోజుల క్రితమే వివాహం కాగా, ఈ విషయాన్ని దీపీందర్ ఇన్ స్టాలో పోస్ట్ చేయడంతో అందరికీ తెలిసింది. కొత్త జంట హనీమూన్ పూర్తి చేసుకుని ఫిబ్రవరిలోనే ఇండియాకు వచ్చిందట.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News