హైదరాబాద్: ఆక్స్ ఫర్డ్ గ్రామర్ స్కూల్ జూనియర్ విద్యార్ధులు భిన్న రుచులతో నిర్వహించిన ఫుడ్ ఫెస్ట్ ఆకట్టుకుంది. పిల్లలకు భోజన మర్యాదలు, భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో వండిన విభిన్న వంటకాలను పంచుకుని, కలిసి తినే అలవాటు యొక్క ప్రాముఖ్యతపై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశంతో స్కూల్ యాజమాన్యం మంగళవారం ఈ పుడ్ ఫెస్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా పుడ్‌ఫెస్ట్‌ను ఉద్దేశించి పోషకాహార నిపుణులు, హెల్త్ అండ్ వెల్నెస్ ప్రెజెంటర్ డాక్టర్ రోహిణి రామన్ మాట్లాడుతూ ఒత్తిడిని తగ్గించడానికి, ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో పౌష్టికాహారం యొక్క ప్రాముఖ్యతను తల్లిదండ్రులతో పాటు విద్యార్థులకు వివరించారు. స్కూల్ ఉపాధ్యక్షురాలు మణికొండ ప్రార్ధన, సంచాలకులు మరియు ప్రిన్సిపాల్ ఈ కార్యక్రమంలో పాల్గోన్న విద్యార్ధులు మరియు తల్లిదండ్రులను ప్రోత్సహిస్తూ అభినoదిoచారు. ఆహ్లాద కరమైన వాతావరణంలో జరిగిన పుడ్‌ఫెస్ట్‌లో ఆక్స్‌ఫర్డ్ గ్రామర్ స్కూల్ ప్రీ-ప్రైమరీ విభాగం విద్యార్థులు తమ ఇంట్లో చేసిన ఫలహారాలను తీసుకు వచ్చారు. రుచికరమైన, ఆరోగ్యకరమైన వంటకాలను చిన్నారులు వారి తల్లిదండ్రులతో కలిసి ప్రదర్శించారు.
విభిన్న రుచులతో ఆక్స్‌ఫర్ట్ స్కూల్‌లో ఫుడ్ ఫెస్ట్
- Advertisement -
- Advertisement -
- Advertisement -