Friday, December 20, 2024

ఈ చికెన్ తింటే.. ఆరోగ్యం చిత్తే

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/సిటీ బ్యూరో: గ్రేటర్ హై ద రాబాద్ బేగంపేట్‌లో 700 కిలోల కు ళ్ళిన కోడి మాంసం(చికెన్)ను జీహెచ్‌ఎం సి వెటర్నరీ డాక్టర్లు, నార్త్ జోన్ టాస్క్‌ఫో ర్సు పోలీసులు పట్టుకున్నారు. బేగంపేట్ ప్రకాష్‌నగర్‌లోని బాలయ్య చికెన్ సెంటర్ లో ఈ 700 కిలోల కుళ్ళిపోయిన చికెన్ ఉన్నట్టు ఫిర్యాదు అందుకున్న నార్త్ జోన్ టాస్క్‌ఫోర్సు పోలీసులు దాడులు నిర్వ హించి నిందితుడిని పట్టుకున్నారు. నింది తుడు జీ. బాలయ్య(36)ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఫుడ్ సేఫ్టీ అ ధికారి స్వాతి, వెటర్నరీ డాక్టర్లు సద్గుణ, మారుతిలు పట్టుకున్న చికెన్ ను సీజ్ చేసి జీహెచ్‌ఎంసికి చెందిన రెండరింగ్ ప్లాం ట్‌కు తరలించారు. నిందితుడు బాలయ్య నడుపుతున్న చికెన్ సెంటర్‌కు కనీసం ట్రేడ్ లైసెన్స్ కూడా లేదని వారు గుర్తించారు. ప్రజలు గుర్తించకుండా కేవలం బోర్డు ఏర్పాటు చేసుకుని కొద్దిపాటిగా తాజా చికెన్‌ను సెంటర్‌లో విక్రయిస్తూ మిగతాదంతా కుళ్ళిన చికెన్‌ను విక్రయిస్తున్నారని అధికారులు గుర్తించారు. ఈ దాడుల్లో అధికారులు నోరెళ్ళబెట్టే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

గత 10 నెలలుగా ఈ కుళ్ళిన చికెన్, చికెన్ వేస్టేజ్, చికెన్ బొక్కలను నగరంలోని మద్యం దుకాణాల వద్ద విక్రయించే చికెన్ ఫ్రై దుకాణాలకు, కల్లు కాంపౌండ్‌లోనూ ఫాస్ట్‌ఫుడ్ దుకాణాలకు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. రుచికరంగా ఉండేందుకు ప్రత్యేక రసాయనాలు అద్దుతున్నట్టు అధికారులు గుర్తించారు. నగరంలో ఇలాంటివి మరో 6 చికెన్ సెంటర్లు నడుస్తున్నాయని, నిందితుడు సమాచారమిచ్చారనీ, వాటిని కూడా త్వరలోనే సీజ్ చేసి నిర్వాహకులను పట్టుకుంటామని అధికారులు సద్గుణ, స్వాతి, మారుతిలు స్పష్టంచేశారు. ఈ దుకాణాల ద్వారా రోజుకు వందలాది కిలోల హానికరమైన చికెన్ నగర ప్రజలు తీసుకుంటున్నారనీ, వీటి వల్ల అనారోగ్యంబారిన పడటం ఖాయమని అధికారులు వెల్లడిస్తున్నారు. చికెన్ సెంటర్లపై కూడా ఎప్పటికప్పుడు దాడులు నిర్వహించనున్నట్టు అధికారులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News