- Advertisement -
తెలంగాణలోని గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ ఘటనలు కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోని పలు గురుకుల స్కూల్ లో ఫుడ్ పాయిజన్ ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఇలాంటి ఘటనలు పునావృతం కావొద్దని రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరించినా..ఫుడ్ పాయిజన్ ఘటనలు మాత్రం ఆగడంలేదు. తాజాగా మరో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు ఫుడ్ పాయిజన్ అయ్యింది.
మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలం దామరవంచ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ వల్ల ముగ్గురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులకు వాంతులు, విరోచనాలు రావడంతో వెంటనే సిబ్బంది చికిత్స కోసం గుడూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం విద్యార్థులు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
- Advertisement -