Monday, January 20, 2025

కస్తూర్భా పాఠశాలలో ఫుడ్ పాయిజన్.. 70మంది విద్యార్థినులకు అస్వస్థత..

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్: ఫుడ్‌ పాయిజన్‌ కారణంగా కస్తూర్భా పాఠశాలలో దాదాపు 70 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. తీవ్రమైన కడుపునొప్పితో పాటుగా వాంతులు చేసుకోవడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన నిజామాబాద్‌ జిల్లా భీంగల్‌ మండల కేంద్రంలో సోమవారం రాత్రి జరిగింది. విద్యార్థినులు రాత్రి భోజనం చేసిన తర్వాత తీవ్ర కడుపునొప్పితో బాధపడుతూ వాంతులు, విరోచనాలు చేసుకున్నారు.

దీంతో వారిని పాఠశాల సిబ్బంది చికిత్స కోసం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి స్పందిస్తూ.. విద్యార్థినులు అస్వస్థతకు గల కారణాలపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి.. బాధ్యులను కఠినంగా శిక్షించాలని జిల్లా కలెక్టర్ ను ఆదేశించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News