Tuesday, January 7, 2025

మాగనూర్‌లో మళ్లీ వికటించిన మధ్యాహ్న భోజనం

- Advertisement -
- Advertisement -

40మందికి అస్వస్థత, ఒకరి పరిస్థితి
విషమం బేకరీలోని తినుబండారాలే కారణం: కలెక్టర్

మన తెలంగాణ/మాగనూర్/మక్తల్: నారాయణపేట జిల్లా, మాగనూరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మంగళవారం మధ్యాహ్న భోజనం మరోసారి వికటించింది. ఫలితంగా 40 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే..పాఠశాలలో 400 మంది విద్యార్థులు భోజనం చేయ గా అందులో 40 మంది అస్వస్ధతకు గురయ్యారు. వీరిని ఉపాధ్యాయులు వెంటనే స్థా నిక పిహెచ్‌సికి తరలించారు. 27 మందికి ప్రథ మ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మక్తల్ ప్రభుత్వ అస్పత్రికి తరలించారు. నేత్ర అనే తొమ్మిదవ తరగతి విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉండడంతో ఆమెను మహబూబ్‌నగర్ ఆస్పత్రికి తరలించారు. మిగతా 26 మందికి మక్తల్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. తహసీల్దార్ పర్యవేక్షనలో మధ్యా హ్నం భోజనం వండించిన ఆహారం ఏ కారణం తో వికటించిందోనని అధికారులు తర్జనభర్జనపడుతున్నారు.

గతంలో ఆహారం వికటించిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని నిలువ ఉన్న సరకులను మార్చి కొత్త సరకులను తీసుకునివచ్చి అధికారుల సమక్షంలో వంటలు వండినా ఆహారం వికటించడంపై కారణాలు తెలియడం లేదు. ఈ విషయంలో పాఠశాలలో వంటలు వండిన కార్మికులను, ఉపాధ్యాయులను డిఎస్‌పి లింగయ్య ఆధ్వర్యంలో పోలీసు లు విచారించారు. అదనపు కలెక్టర్ బేన్‌షాలం, ఆర్‌డిఒ రాంచందర్ పాఠశాలలో చోటు చేసుకున్న సంఘటనపై సమీక్ష నిర్వహించారు. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మధ్యాహ్న భోజనం వికటించి విద్యార్థులు అస్వస్థతకు గురికావడంతోఉన్నతస్థాయిలో విచారణ జరి పి వాస్తవాలను బయటపెట్టాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు.

బేకరీలోని తినుబండారాలే కారణం
మాగనూరు జడ్పీ హై స్కూల్ విద్యార్ధులు మంగళవారం మధ్యాహ్నం భోజనానికి ముందు 22 మంది వివిధ బేకరీలు, దుకాణాలలో తినుబండారాలు కొనుక్కుని తిన్నారని జిల్లా కలెక్టర్ పట్నాయక్ తెలిపారు. వివిధ ప్రాంతాల నుండి పాఠశాలకు వచ్చే విద్యార్ధులు పాఠశాల సమీపంలోని 14 చోట్ల ఉన్న దుకాణాలు, బేకరీలలో తినుబండారాలు తి న్నం దు వల్లే భోజన అనంతరం ఆ విద్యార్ధులు అస్వస్థతకు గురైనట్లు తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్నం భోజనం నుంచి విద్యార్ధులు అస్వస్థతకు గురి కాలేదని అధికారుల విచారణలో తెలిసిందని కలెక్టర్ తెలిపారు. గతవారం ప్రతి హాస్టల్, రెసిడెన్సియల్ సంస్థలను కలెక్టర్, అదనపు కలెక్టర్, అసిస్టెంట్ కలెక్టర్, ఆర్‌డిఓలు సందర్శించినట్లు తెలిపారు. పాత బియ్యం బస్తాలన్నీ మార్చేసినట్లు తెలిపారు. అన్ని శాఖల అధికారులు పాఠశాలలను సందర్శించి తనిఖీ చేసి స్టాకులను ధృవీకరించాలని తెలిపారు. పలు పాఠశాలల్లో నోటీసులు అందజేసి చర్యలు తీసుకునట్లు కలెక్టర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News