- Advertisement -
కరీంనగర్: సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ జరిగింది. దీంతో 50మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకి గురయ్యారు. ఈ సంఘటన జిల్లాలోని చొప్పదండిలో చోటుచేసుకుంది. వాంతులు, విరేచనాలతో విద్యార్థులు తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయం తెలియగానే.. సోషల్ వెల్ఫేర్ గర్ల్స్ హాస్టల్ యాజమాన్యం అప్రమత్తమైంది. 50మంది విద్యార్థులను జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కరీంనగర్ ఏరియా ఆసుపత్రిలో విద్యార్థులు చికిత్స పొందుతున్నారు. అయితే ఇందులో పలువురి పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు పేర్కొన్నట్లు సమాచారం. ఇక, ఈ విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అసలు ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Food Poison in Social Welfare girls hostel in Karimnagar
- Advertisement -