Thursday, December 26, 2024

సదాశివపేట హైటెక్ బావర్చి హోటల్‌లో ఫుడ్ పాయిజన్

- Advertisement -
- Advertisement -

 

14 మందికి అస్వస్థత.. సర్కార్ ఆసుపత్రిలో చికిత్స

సంగారెడ్డి: జిల్లాలోని సదాశివపేట హైటెక్ బావర్చి హోటల్‌లో ఫుడ్ పాయిజన్ అయింది. ఆహారం తిన్న 14 మంది అస్వస్థత గురయ్యారు. బాధితులను చికిత్స నిమిత్తం సదాశివపేట ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. ప్రస్తుతం వారికి వైద్యులు చికిత్స అందిస్తున్నారు. పలువురు హైటెక్ బావర్చిలో శుక్రవారం రాత్రి మాంసాహార భోజనం చేశారు. కాసేపటికి వాంతులు, విరేచనాలు, కడుపు పట్టేయడంతో బాధితులను సదాశివపేట సర్కార్ ఆసుపత్రికి తరలించించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న సదాశివపేట మున్సిపల్ కమిషనర్ హోటల్‌ను సీజ్ చేశారు. హోటల్ నిర్వాహకులపై అధికారులు కఠినంగా చర్యలు తీసుకోవాలని బాధితుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News