Sunday, January 12, 2025

గిరిజన హాస్టల్‌లో ఫుడ్ పాయిజనింగ్

- Advertisement -
- Advertisement -

వికారాబాద్ జిల్లా, తాండూరు పట్టణం సాయిపూర్‌లోని గిరిజన బాలికల వసతిగృహంలో 10మంది విద్యార్థిను లు మంగళవారం ఫుడ్ పాయిజన్‌తో అస్వస్థత కు గురయ్యారు. గమనించిన ఇన్‌ఛార్జి విశ్వకుమారి స్థానిక ఉపాధ్యాయుల సహకారంతో వా రిని చికిత్స కోసం తాండూర్ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్స అనంతరం వారిని మళ్లీ వసతిగృహానికి తీసుకొచ్చారు. వచ్చిన గంట తర్వాత చికిత్స పొందిన ఐదుగురు కడుపులో మళ్ళీ నొప్పి వస్తుందంటూ చెప్పడంతో వారిని మాతాశిశు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నారు. గిరిజన వసతి గృహంలో మొత్తం 30 మంది విద్యార్థినులు ఉంటున్నారు. భోజనం వ డ్డించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారంటూ స్థానిక వసతి గృహం, పాఠశాల ఇన్‌ఛార్జి వంట మనుషులను హెచ్చరించినా పట్టించుకోలేదని విద్యార్థినులు చెబుతున్నారు.

విద్యార్థినులు ఫుడ్ పా యిజన్ కారణంగా అస్వస్థతకు గురై ఆసుపత్రి లో చికిత్స పొందుతున్న విషయం తెలుసుకున్న ఎంఎల్‌ఎ మనోహర్ రెడ్డి సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్‌కు విన్నవించడంతో ఆయన వెంటనే తహసిల్దార్ తారాసింగ్‌కు సమాచారం చేరవేశారు. వెంటనే ఆసుపత్రికి బయలుదేరి జరిగిన ఘటన పైన ఆరా తీశారు. వీరితోపాటు స్థానిక కౌన్సిలర్లు రత్నమాల, నీరజ రెడ్డి, మార్కెట్ కమి టీ ఛైర్మన్ బాల్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నర్సింలు వసతి గృహాన్ని సందర్శించి వి ద్యార్థినులతో మాట్లాడారు. అనంతరం అక్కడి పరిసరాలతోపాటు భోజనశాలను సైతం పరిశీలించారు. విద్యార్థులకు భోజనం వడ్డించడంలో వంట నిర్వాహకులు ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News