Monday, January 20, 2025

నాగారం గురుకులంలో ఫుడ్‌ పాయిజన్‌.. 33 మంది విద్యార్థులకు అస్వస్థత

- Advertisement -
- Advertisement -

ఘట్ కేసర్: మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధి రాంపల్లిలోని మైనార్టీ గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో 33 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. చికిత్స నిమిత్తం విద్యార్థులను ఘట్ కేసర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. తమకు సమాచారం ఇవ్వలేదని పిల్లల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. గురుకులంలో మెను ప్రకారం భోజనం పెట్టకుండా నాసిరకం భోజనం పెడుతుండడంతో అనారోగ్యం ఏర్పడుతుందని విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు.

విద్యార్థులకు భోజనానికి బదులుగా పాయిజన్ రూపంలో ఫుడ్ ను వాళ్ల శరీరంలో కొంచెం కొంచెం పంపిస్తున్నట్టుగా ఉందని తల్లిదండ్రులు వాపోతున్నారు. గురుకులాల్లో చదివే విద్యార్థుల ఆరోగ్యాలు విషమతుల్యంగానే ఉన్నాయని, విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు చేస్తే వాళ్లకు ఉన్న అనారోగ్య సమస్యలు బయటపడుతాయని తల్లిదండ్రులు ప్రభుత్వానికి సూచిస్తున్నారు. గత ప్రభుత్వం నుంచే గురుకులాల్లో నాణ్యత లేని భోజనం పెడుతున్నారని, ఇప్పటికైనా విద్యార్థులకు మంచి నాణ్యతో పాటు ప్రోటీన్, విటమిన్ ఫుడ్ అందించాల్సిన అవసరం ఉందని తల్లిదండ్రులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News