Wednesday, January 22, 2025

సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకులంలో ఫుడ్ పాయిజన్

- Advertisement -
- Advertisement -
  • ఇద్దరు విద్యార్థినులకు అస్వస్థత

నారాయణఖేడ్: సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండల కేంద్రమైన సిర్గాపూర్ గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్ కావడంతో ఇద్దరు బాలికలు వాంతులు, విరేచనాలతో అస్వస్థతకు గురయ్యారు. వారిని మంగళవారం చికిత్స నిమిత్తం ఖేడ్ ఏరియా ఆసుపత్రికి తరలించారు. కాగా ఇంటర్మీడియెట్ విద్యార్థినులు గాయత్రి, స్వప్నలు వాంతులు చేసుకోవడంతో చికిత్స అందిస్తున్నామని ఆసుపత్రి వైద్యులు తెలిపారు. గిరిజన బాలికల గురుకుల పాఠశాలలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ వరకు 500ల మంది బాలికలు విద్యాభ్యాసం చేస్తున్నారు. గురుకులంలో మెను ప్రకారం భోజనం పెట్టకుండా నాసిరకం భోజనం పెడుతుండడంతో అనారోగ్యం ఏర్పడుతుందని విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు వాపోతున్నారు. కాగా విద్యార్థులు అస్వస్థతకు గురైనప్పటికీ విద్యార్థులకు ఏమికాలేదని వైస్ ప్రిన్సిపల్ విజయ పేర్కొనడం గమనార్హం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News