Sunday, January 12, 2025

పనిచేయని సిఎం హెచ్చరికలు..తాండూరు గిరిజన హాస్టల్‌లో 30 మందికి అస్వస్థత

- Advertisement -
- Advertisement -

రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, హాస్టళ్లు, గురుకులాల్లో కలుషిత ఆహార ఘటనలు పునరావృత్తమవుతూనే ఉన్నాయ ని, సిఎం హెచ్చరికలు కూడా పనిచేయడం లేదని బాలల హక్కుల సంక్షేమ సంఘం(బిహెచ్‌ఎస్‌ఎస్) ఆందోళన వ్యక్తం చేసింది. కలుషిత ఆహారంతో విద్యార్థులు ఆసుపత్రుల పాలుకావటం, మరణాలు సంభవించిన సంఘటనలను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విద్యార్థులను కన్నబిడ్డల్లా చూసుకోవాలని, వారికి అందించే ఆహారం విషయంలో ఏమాత్రం ఏమరుపాటుగా ఉండవద్దని చెప్పిన విషయాన్ని బిహెచ్‌ఎస్‌ఎస్ రాష్ట్ర అధ్యక్షుడు డా గుండు కిష్టయ్య, ప్రధాన కార్యదర్శి ఇంజమూరి రఘునందన్ గుర్తు చేశారు. ఏమాత్రం నిర్లక్ష్యం ఉన్నట్లు తేలినా సంబంధిత అధికారులు, సిబ్బందిని ఉద్యోగాల నుంచి తొలగిస్తామని హెచ్చరించినా ఘటనలు జరుగుతూనే ఉన్నాయని అన్నారు.

ముఖ్యమంత్రి నవంబర్ 29 నాటి ప్రకటన అనంతరం కూడా డిసెంబర్ 2న పిఎ పల్లి మండలంలో మోడల్ స్కూల్ లో కలుషితాహార ఘటన జరిగిందని, ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థినిలు మౌనిక, పూజిత, మల్లీశ్వరి శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారింది. స్థానిక ప్రయివేట్ ఆసుపత్రిలో చికిత్స అందించినా నయం కాకపోవడంతో దేవరకొండ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారని తెలిపారు. గత నాలుగైదు రోజులుగా వండిన అన్నం తిని కడుపు నొప్పి వాంతులు అవుతున్నాయని చెప్పినా స్పెషల్ ఆఫీసర్ పట్టించుకోలేదని విద్యార్ధులు ఆవేదనతో చెప్తున్నారన్నారు. కాగా తాజగా తాండూరు గిరిజన బాలికల హాస్టల్‌లో కలుషిత ఆహారం తిని 30 మంది విద్యార్ధులు అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వారిని వెంటనే మెరుగైన చికిత్స కోసం వికరాబాద్ జిల్లా కేంద్రములోని ఆసుపత్రికి తరలించారని, చికిత్స అందిస్తున్నారన్నారు.

విద్యార్థులకు కల్తీ ఫుడ్ పెడితే జైలుకు పంపిస్తామని సిఎం పదేపదే హెచ్చరిస్తున్నప్పటికి ఇలాంటి కలుషితాహారా ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి హెచ్చరికలను ప్రభుత్వ అధికారులు సీరియస్ గా తీసుకోవడం లేదని సిఎం సొంత జిల్లాల్లోనే పరిస్థితి ఇలా ఉంటే మిగితా చోట్ల ఇంకెంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చని వరన్నారు. ఈ ఘటనలకు అంతం ఎపుడని ప్రశ్నించారు. తక్షణం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా సమీక్ష చేసి నిర్ధిష్ట కార్యాచరణ ప్రకటించాలని కోరారు. రాష్ట్ర స్థాయిలో కలెక్టర్, మండల స్థాయిలో తహసీల్దార్ వరకు ప్రత్యేక శ్రద్ధతో నిరంతరము తనిఖీలు చేస్తూనే, అందుకు కావలసిన సౌకర్యాలు, నిధుల కేటాయింపులు చేయాలనీ డిమాండ్ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News