- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ పోస్టుల భర్తీకి జరిగిన పరీక్షకు సంబంధించిన ప్రాథమిక కీ ని, రెస్పాన్స్ షీట్లను టిఎస్పిఎస్సి వెబ్సైట్లో పొందుపరిచింది. బుధవారం(నవంబర్ 16) నుంచి ఈ నెల 20 వరకు ప్రాథమిక కీ అభ్యంతరాలు స్వీకరించనున్నట్లు కమిషన్ తెలిపింది.
అభ్యర్థులు టిఎస్పిఎస్సి వెబ్సైట్లో అందుబాటులోకి ఉన్న లింకు ద్వారా మాత్రమే అభ్యంతరాలు తెలియజేయాలని పేర్కొంది. ఇమెయిల్, వ్యక్తిగతం సమర్పించే అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోమని కమిషన్ స్పష్టం చేసింది. ఇతర వివరాలకు టిఎస్పిఎస్సి వెబ్సైట్ చూడాలని తెలిపింది.
- Advertisement -