Friday, December 20, 2024

ఆహార కొరత ప్రపంచానికి మహా విపత్తే : ఐరాస చీఫ్ హెచ్చరిక

- Advertisement -
- Advertisement -

Food shortage world catastrophe: UN chief warns

బెర్లిన్ : ప్రపంచంలో పెరుగుతున్న ఆహారం కొరత కారణంగా మున్ముందు ప్రపంచ దేశాలు తీవ్ర విపత్తును ఎదుర్కోవాల్సి ఉంటుందని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ తీవ్ర హెచ్చరిక చేశారు. శుక్రవారం బెర్లిన్‌లో జరిగిన సదస్సులో సంపన్న, అభివృద్ధి చెందుతున్న దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరు కాగా, ఆయన వీడియో సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాతావరణ మార్పులు, కరోనా మహమ్మారి , పెరుగుతున్న అసమానతల కారణంగా ఇప్పటికే కోట్ల మంది ప్రజలు ప్రభావితం కాగా, తాజాగా ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రపంచ ఆకలి సంక్షోభాన్ని మరింత తీవ్రం చేసిందన్నారు. 2022 లో మరిన్ని కరవు కాటకాలు సంభవించే అవకాశం ఉందని, 2023 ఏడాది కూడా ఘోరంగా ఉండొచ్చని హెచ్చరించారు. ప్రపంచ వ్యాప్తంగా ఎరువులు, ఇంధన ధరలు పెరగడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని, దీంతో ఆసియా , ఆఫ్రికా, అమెరికా వంటి దేశాల్లో పంటలు దెబ్బతింటాయని, ఈ ఏడాది ఆహార లభ్యతలో సమస్యలు వచ్చే ఏడాది ప్రపంచ ఆహార కొరతకు దారి తీయొచ్చన్నారు. పేద దేశాలు తమ ఆర్థిక వ్యవస్థల్ని నిలబెట్టుకొనేలా, ప్రపంచ ఆహార మార్కెట్లను స్థిరీకరించేందుకు దోహదం చేసేలా ప్రైవేటు రంగానికి రుణ ఉపశమనం కలిగించాలని పిలుపు నిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News