Monday, December 23, 2024

గుండెను ఆరోగ్యంగా ఉంచే ఆహారాలు..

- Advertisement -
- Advertisement -

అనారోగ్యకరమైన జీవనశైలి, ఒత్తిడి, కోవిడ్-19 దుష్ప్రభావాల కారణంగా..గుండె సమస్యలు వేగంగా పెరుగుతున్నాయి. గుండె సంబంధిత వ్యాధుల పెద్దలలో మాత్రమే కాకుండా యువత, పిల్లలలో కూడా పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితిలో గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి, ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్రమంలో ఈరోజు మనం గుండె ఆరోగ్యాన్ని ఆరోగ్యంగా ఉంచే, బ్లాకేజ్‌ని తగ్గించడంలో సహాయపడే 5 ఆరోగ్యకరమైన సూపర్ ఫుడ్‌లను ఈ ఆర్టికల్ ద్వారా తెలుసుకుందాం. మీకు తెలియజేస్తాము.

 

బెర్రీలు

బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు, రాస్ప్‌బెర్రీస్, బ్లాక్‌బెర్రీస్ వంటి బెర్రీలలో ఆంథోసైనిన్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడి, వాపును తగ్గిస్తాయి. ఇందులో అధిక మొత్తంలో ఫైబర్ ఉంటుంది. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడంలో చాలా సహాయపడుతుంది.

 

చేపలు

సాల్మన్, మాకేరెల్, సార్డినెస్, ట్రౌట్ వంటి కొవ్వు చేపలలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ట్రైగ్లిజరైడ్‌లను తగ్గిస్తాయి. అంతేకాకుండా రక్తపోటును నియంత్రిస్తాయి.

డ్రై ఫ్రూట్స్

బాదం, వాల్‌నట్‌లు, పిస్తాపప్పులు, అవిసె గింజలు వంటి నట్స్‌లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ఫైబర్, ప్లాంట్ స్టెరాల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి LDL కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఎంతో సహాయపడుతాయి. అంతేకాకుండా గుండె ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయి. అయితే వాటిని నానబెట్టికొని ఉదయానే తినాలి.

ఆకు పచ్చని కూరగాయలు

బచ్చలికూర, కాలే, స్విస్ చార్డ్, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్‌లో విటమిన్లు, మినరల్స్, విటమిన్ కె వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ధమనులను రక్షించడంలో సహాయపడతాయి. వీటిలో ఉండే నైట్రేట్ రక్త ప్రసరణ పనితీరును మెరుగుపరుస్తుంది.

వోట్

కరిగే ఫైబర, ముఖ్యంగా బీటా-గ్లూకాన్, ఓట్స్‌లో ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతాయి.అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో కూడా ఎంతో సహాయపడుతాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News