Wednesday, January 22, 2025

క్యాన్సర్‌ను నివారించే ఆహార పదార్థాలు

- Advertisement -
- Advertisement -

దేశంలో ఎంతో మంది క్యాన్సర్ బారినపడి ప్రాణాలు వదులుతున్నారు. ప్రఖ్యాత భారతీయ రేడియేషన్ ఆంకాలజిస్ట్ డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ పై మాట్లాడారు. క్యానర్లు మరణశిక్ష కాదని, చాలా క్యాన్సర్‌లను ప్రారంభ దశలో గుర్తిస్తే నివారించవచ్చు, నయం చేయవచ్చన్నారు. ఇటీవల ఆయన ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో దత్తాత్రేయుడు మాట్లాడుతూ.. క్యాన్సర్‌ రాకుండా ఉండేందుకు ప్రతి ఒక్కరూ పీచుపదార్థాలున్న ఆహారం తీసుకోవాలని కోరారు.

ఆకు కూరలు తినాలని, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకోవడం తగ్గించాలని హెచ్చరించారు. రోగనిరోధక శక్తి స్థాయిలను పెంచడానికి కొన్ని వ్యాయామాలు చేయాలని డాక్టర్ నోరి సూచించారు. అలాగే వేయించిన ఆహార పదార్థాలను తీసుకోవడం తగ్గించాలన్నారు. సరైన ఆహారం తీసుకోవడం వల్ల క్యాన్సర్ దాడి తగ్గుతుందని డాక్టర్ నోరి చెప్పారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News