శాన్‌జోస్: ఫుట్‌బాల్ ఆటగాడిని మొసలి చంపిన సంఘటన ఉత్తర అమెరికాలోని కోస్టారి రికా దేశంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… జీసస్ అల్బర్టో లోపజ్ ఓర్ట్ (23) అనే ఫుట్‌బాల్ ఆటగాడు షాంటా క్రుజ్ నగరంలో నివసిస్తున్నాడు. జీసస్ అమెటర్ క్లబ్ తరపున అతడు ఫుట్‌బాల్ ఆడుతున్నాడు. కోస్టారికా క్యాపిటల్ శాన్‌జోస్‌కు 140 మైళ్ల దూరంలో షాంటా క్రుజ్ ఉంది. జీసస్ అల్బర్టో రియో కానాస్ నది వద్దకు వచ్చాడు. ఫుట్‌బాల్ ఆటగాడు ఈతకొడుతానని చెప్పడంతో మొసళ్లు ఉన్నాయని వద్దని స్థానికులు చెప్పారు. జీసస్ మాత్ర వినకుండా నదిలోకి దూకడంతో అక్కడే కాపు కాస్తున్న మొసలి అతడిని నోట్లో కరుచుకొని నది లోపలికి తీసుకెళ్లింది. మొసలి అతడిని చంపేసి మృతదేహాన్ని నోట్లో కరుచుకొని తిరుగుతుండగా పోలీసులు మొసలిని కాల్చి చంపారు. మొసలి నోట్లో నుంచి మృతదేహాన్ని బయటకు తీశారు. జీసస్ మృతి పట్ల తొటి ఆటగాడు డిపోర్టివో రియో కానస్ సంతాపం తెలిపారు. అతడికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. జీసస్ అంతిమ యాత్రలో దాదాపు వేల మంది ఫుట్‌బాల్ అభిమానులు పాల్గొన్నారు.