Wednesday, January 22, 2025

అండర్-11 ఫుట్ బాల్ టోర్నమెంట్: మ్యాచ్ ఓడిపోయినందుకు చితకబాదిన కోచ్..

- Advertisement -
- Advertisement -

Football Coach brutally beaten up under-11 team players

వారణాసి: మ్యాచ్ ఓడిపోయినందుకు అండర్-11 ఫుట్ బాల్ జట్టులోని కొంతమంది ప్లేయర్స్ ను కోచ్ చితకబాదాడు. ఈ ఘటన వారణాసిలో చోటుచేసుకుంది. శుక్రవారం బనారస్ హిందు యునివర్సిటీ క్యాంపస్ ఫుట్ బాల్ టోర్నమెంట్ నిర్వహించింది. వారణాసి నుంచి ఈ టోర్నమెంట్ లో పాల్గొన్న అండర్-11 ఫుట్ బాల్ జట్టు ఓటమిపాలైంది. అయితే, జట్టు ఓడిపోవడంతో కోపంతో రగిలిపోయిన కోచ్ మొహమ్మద్ షాదాబ్.. కొంతమంది ప్లేయర్లను రూమ్ లో వేసి బెల్ట్, స్టిక్, చెప్పులతో చితకబాదాడు. దీంతో సదరు ప్లేయర్స్ ఈ విషయం గురించి తమ తల్లిదడ్రులకు చెప్పడంతో.. వారు కోచ్ పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా తల్లితండ్రులకు ఈ విషయం తెలియకముందే కోచ్ పారిపోయాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేయనున్నట్లు పేర్కొన్నారు.

Football Coach brutally beaten up under-11 team players

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News