Thursday, December 19, 2024

ఫుట్‌బాల్ దిగ్గజం పీలే కన్నుమూత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఫుట్‌బాల్ దిగ్గజ ఆటగాడు పీలే (82) కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న అతడి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో శుక్రవారం ఉదయం తుదిశ్వాస విడిచారని ఆయన కూతురు తెలిపింది. పేగు క్యాన్సర్ సోకడంతో అతడు తీవ్ర అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. ఆస్పత్రి వెళ్లి చికిత్స తీసుకుంటుండగా ఊపిరితిత్తులకు ఇన్‌ఫెక్షన్ సోకింది. కీమోథెరపీ చేయడంతో అతడి శరీరం స్పందించలేదని డాక్టర్లు తెలిపారు. ఆరోగ్య పరిస్థితి విషమంగా మారడంతో మృతి చెందారు.

1958, 1962, 1970లో బ్రెజిల్‌కు ప్రపంచ కప్ అందించారు. పీలే బ్రెజిల్ తరుపున పీలే 92 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడి 77 గోల్స్ చేశారు. తన జీవిత కాలంలో మొత్తం 1363 మ్యాచ్‌లో 1281 గోల్స్ చేశారు. 2000లో ప్లేయర్ ఆప్ ది సెంచరీలో దక్కింది. 1940 అక్టోబర్ 23న పీలే జన్మించారు. అతడి పూర్తి పేరు ఎడ్సన్ అరంటీస్ డో నాస్సిమెంటో, తండ్రి ఫుట్‌బాల్ ఆటగాడు కావడంతో కుమారుడిని ఆట వైపు మళ్లించాడు. 16 సంవత్సరాలకే శాంటోస్ క్లబ్ లో చేరి మంచి ప్రతిభ కనబరిచాడు. దీంతో జాతీయ జట్టులోకి అతడి ఆహ్వానం అందడంతో అదరగొట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News