Saturday, December 21, 2024

చట్టసభల్లో 50 శాతం బిసి రిజర్వేషన్‌ల కోసం…

- Advertisement -
- Advertisement -
ఈ నెల 13, 14 తేదీల్లో ఛలో ఢిల్లీ : ఆర్.కృష్ణయ్య

మన తెలంగాణ / హైదరాబాద్ : చట్టసభల్లో బిసిలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని, బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేస్తూ కేంద్రంపై ఒత్తిడి తేవడానికి ఈ నెల 13, 14 తేదీల్లో వేలాందిమందితో చలో ఢిల్లీ కార్యక్రమం చేపడుతున్నట్లు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యకుడు ఆర్. కృష్ణయ్య ప్రకటించారు. ఢిల్లీలో పార్లమెంటు వద్ద భారీ ప్రదర్శన నిర్వహిస్తామని, ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను, ప్రతిపక్ష పార్టీలను, లోక్ సభ, రాజ్యసభ సభ్యులను కలిసి పార్లమెంటు లో బిసి బిల్లు ప్రవేశ పెట్టేలా ఒత్తిడి తెస్తామని చెప్పారు. శనివారం హైదరాబాద్‌లో జాతీయ బిసి సంక్షేమ సంఘం సమావేశం జరిగింది. సంఘం కన్వీనర్ గుజ్జ కృష్ణ, రాష్ట్ర బిసి హక్కుల పోరాట కమిటీ అధ్యక్షులు మహీందర్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ బిసిలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్ న్యాయబద్దమైందని అన్నారు.

దేశంలో 2,600 బిసి కులాలు ఉంటే ఇప్పటివరకు 2,540 బిసి కులాలు పార్లమెంటు గేటు దాటలేదని కృష్ణయ్య తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం సేకరించిన లెక్కల ప్రకారం రాజకీయరంగంలో బిసిల ప్రాతినిధ్యం 14 శాతం దాటడం లేదని అన్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికలలో బిసిలకు అన్ని రాజకీయ పార్టీలు 50 శాతం టికెట్లు ఇవ్వాలని కృష్ణయ్య డిమాండ్ చేశారు. మండల్ కమిషన్ చేసిన 40 సిఫార్సుల్లో కేవలం రెండు సిఫార్సులు మాత్రమే అమలుచేశారని మిగితా 38 సిఫార్సులు ఇంతవరకు అమలుకు నోచుకోలేదన్నారు.

కేంద్ర ప్రభుత్వo త్వరలో చేపట్టబోయే జనగణనలో బిసి కుల గణన చేపట్టాలని, పంచాయతీరాజ్ సంస్థల్లో బిసి రిజర్వేషన్లను 34 శాతం నుండి 52 శాతానికి పెంచాలని, ఈ రిజర్వేషన్లకు రాజ్యాంగ భద్రత కల్పించాలని కోరారు. బిసి ఉద్యోగులకు ప్రమోషన్లలో రిజర్వేషన్లు కల్పించాలని, కేంద్రంలో బిసిలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలని, బిసిల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు. ప్రత్యకంగా కేంద్ర స్థాయిలో స్కాలర్ షిప్ లు, ఫీజు రియింబర్స్ మెంట్, ఉపాధి రంగంలో శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయాలన్నారు. బిసిలకు సామాజిక రక్షణ, భద్రత కల్పించడానికి చట్టం తేవాలని, బిసిల విద్యా, ఉద్యోగ రిజర్వేషన్ల పై ఉన్న క్రిమి లేయర్ ను తోలగించాలని కోరారు. కేంద్ర బడ్జెటులో బిసిలకు 2 లక్షల కోట్ల బడ్జెటు కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థలలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగ ఖాళీలు భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో నీల వెంకటేష్, రాజేందర్, అనంతయ్య, నంద గోపాల్, వేముల రామకృష్ణ, భూపేష్ సాగర్, ఏనుగంటి రాజు నేత, జెన్నాల నరసింహ, ఉదయ్, నిఖిల్, బలరాం తదితరులు పాల్గొన్నారు.

BC 2

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News