Sunday, December 22, 2024

కుల గణనకు రూ. 150 కోట్లు

- Advertisement -
- Advertisement -

జిఒ జారీ చేసిన ప్రభుత్వం బిసి నేతల హర్షం

మన తెలంగాణ/హైదరాబాద్ :రాష్ట్రంలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వేకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కులగణన చేయాలని ఇటీవల అసెంబ్లీలో తీర్మా నం మేరకు రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం జిఒ జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఇందుకోసం సుమారు రూ.150 కోట్లు ఖర్చవుతుందని బిసి కమిషన్ అంచనా వేసింది. గడిచిన అసెంబ్లీ సమావేశాల్లో, రాష్ట్రంలో కులగణన చేపట్టాలని ప్రభు త్వ ప్రవేశపెట్టిన ఏకగ్రీవ తీర్మానంపై అఖిల పక్షాలు ఆమోదం తెలిపాయి. జనాభాకు అనుగుణంగా నిధులు కేటాయించడమే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే సర్వే చేపడుతున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అసెంబ్లీ వేదికగా పేర్కొన్నారు. ప్రజలను పాలకులను చేయడమే తమ ఉద్దేశ్యమని తెలిపారు. రాష్ట్రంలో ఇంటింటికి వెళ్లి బిసి, ఎస్‌సి, ఎస్‌టి తదితర సామాజిక వర్గాల వివరాలను సేకరించడానికి వీలుగా ప్రభుత్వ తీర్మానం మేరకు జీవో 26 విడుదల చేయడం ప్రభుత్వ, నిబద్ధతకు నిదర్శనమని రాష్ట్ర బిసి కమిషన్ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్‌రావు అన్నారు. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ఒక సువర్ణ అధ్యాయానికి తెర తీసిందని అభిప్రాయపడ్డారు. సిఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సిఎం బట్టి విక్రమార్క ,బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌లకు ధన్యవాదాలు తెలిపారు.

సమగ్ర కులగణన జీవో విడుదల హర్షనీయం : జాజుల శ్రీనివాస్ గౌడ్
రాష్ట్రంలో సమగ్ర కులగనన చేపట్టి బిసిల జనాభా లెక్కలను సేకరించడానికి రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 26ను విడుదల చేయడంపై బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్‌గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. బిసి కులగణన నిర్వహించి బిసిల లెక్కలు తేల్చాలని రెండు దశాబ్దాలుగా చేస్తున్న పోరాటం ప్రభుత్వం విడుదల చేసిన జీవో ద్వారా ఫలించిందన్నారు. ఈసందర్భంగా ఆయన సిఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, బిసి సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, బిసి సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్ర వెంకటేశంకు బిసి సమాజం తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సమగ్ర కుల గణన నిర్వహించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం సుమారు 150 కోట్లు కేటాయించడం కులగననకు ఇంటింటి వెళ్లి సర్వే నిర్వహించి పకడ్బందీగా కులాల లెక్కలు సేకరించాలని ప్రభుత్వం ఈ జీవోలో పేర్కొనడం అభినందనీయమన్నారు దేశంలో కులాల వారీగా జనాభా లెక్కలు తీసిన రాష్ట్రాల్లో ఆంధ్ర ప్రదేశ్ తర్వాత మూడో రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో నిలిచిపోతుందని కొనియాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News