Monday, December 23, 2024

గ్రూప్ వన్ పరీక్షలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి-

- Advertisement -
- Advertisement -
  • రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీష్

రంగారెడ్డి: గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ హరీష్ సంబంధిత అధికారులకు ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం గ్రూప్ వన్ పరీక్షల నిర్వహణపై జిల్లా కలెక్టర్ హరీష్ సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జూన్ 11న ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 వరకు గ్రూప్ వన్ పరీక్ష జరుగుతుందన్నారు. పరీక్ష నిర్వహణకు జిల్లాలో 131 కేంద్రాలను ఏర్పాటు చేశామని 55,032 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరవుతున్నట్లు తెలిపారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రభుత్వ నియమ నిబంధనలకు లోబడి పరీక్షా కేంద్రాలలో పటిష్టమైన చర్యలు చేపట్టాలని, ఎలాంటి పొరపాట్లకు తావియ్యరాదని సూచించారు. కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య పరీక్ష జరిగేలా అన్ని చర్యలు తీసుకుంటున్నామన్నారు. పరీక్షల నిర్వహణకు లైజన్ అధికారులను నియమించడం జరిగిందన్నారు. చీఫ్ సూపరిండెంటెంట్‌తో పాటు పరీక్ష కేంద్రంలో ఉండి, సమన్వయంతో పనిచేయాలని సూచించారు.

అన్ని విషయాలలోనూ అప్రమత్తంగా ఉండాలని, ముందస్తు పరీక్ష కేంద్రాన్ని సందర్శించి, అవసరమైన ఆయా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తప్పని సరిగా బయోమెట్రిక్ హాజరు ఇవ్వాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులకు తెలిసేలా పరీక్షా కేంద్రం పేరు, పేపర్ కోడ్, ఏరియా ఆయా పరీక్ష కేంద్రం ముందు తప్పనిసరిగా ప్రదర్శించాలని సూచించారు. ఇన్విజ్‌లేటర్లు జాప్యం చేయకుండా సమయానికి పేపర్ ఇవ్వాలని, టైం పూర్తయిన వెంటనే తీసుకోవాలన్నారు. ఉదయం 10:15 నిమిషాల వరకు అభ్యర్థులను పరీక్షా కేంద్రంలోకి. అనుమతిస్తారన్నారు. 10:15 గంటల తర్వాత ఎవరిని లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. పరీక్ష కేంద్రంలోకి ఎలాంటి ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ ఫోన్లు, రైటింగ్ పాడ్స్ అనుమతించరని తెలిపారు. చీఫ్ సూపరిండెంటెంట్‌కు మాత్రమే వారి గది వరకు సెల్ ఫోన్ అనుమతిగలదన్నారు.

అభ్యర్థులను షూస్‌తో అనుమతించరని తెలిపారు. అభ్యర్థులు హాల్ టికెట్‌ను, బ్లూ లేదా బ్లాక్ పాయింట్ పెన్ మాత్రమే తెచ్చుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలలోని అన్ని గదులలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఏవేని సీసీ కెమెరాలు పనిచేయనట్లయితే ముందుగా తెలియజేయాలని చీఫ్ సూపరిండెంటెంట్‌లకు సూచించారు. పరీక్షా కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్,ఫ్యాన్లు మరుగుదొడ్లు, తదితర మౌలిక సదుపాయాలు ఉండేలా చూసుకోవాలన్నారు. పరీక్షా సమయంలో నిరంతరాయంగా విద్యుత్తు ఉండేలా చూడాలని విద్యుత్ శాఖ అధికారులకు, పరీక్షా కేంద్రాలకు అభ్యర్థులు 8:30 గంటలలోగా చేరుకునేలా ఆయా రూట్లలో తగినన్ని బస్సులను నడపాలని ఆర్టీసీ వారికి, పరీక్షా కేంద్రాల పరిసరాలను పరిశుభ్రం చేయించేలా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్లు, డిపిఓ కు సూచించారు.

అదే విధంగా పరీక్ష కేంద్రాల వద్ద మెడికల్ కిట్, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లతో ఏఎన్‌ఎమ్ ను అందుబాటులో ఉంచాలని వైద్యఆరోగ్యశాఖ అధికారులకు సూచించారు. చీఫ్ సూపరిండెంటెంట్లు, ఇన్విజిలేటర్లు ‘నో రిలేషన్ సర్టిఫికెట్‘ ఇవ్వాలన్నారు. ముందు రోజు కూడా ఇన్విజిలేటర్లకు శిక్షణ ఇవ్వాలని చీఫ్ సూపరిండెంటెంట్‌లకు సూచించారు. 48 మంది అభ్యర్థులు ఉన్న గదిలో ఇద్దరు ఇన్విజిలేటర్లను వేయాలని సూచించారు. ఆయా అధికారులందరూ సమన్వయంతో పనిచేసి గ్రూప్ వన్ పరీక్ష సజావుగా నిర్వహించాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ తిరుపతి రావు, జిల్లా రెవెన్యూ అధికారి హరిప్రియ, డీఈఓ సుశీందర్ రావు, జిల్లా అధికారులు, ఎంపిడిఒలు, తహసిల్దారులు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News