కామారెడ్డి ఎంఎల్‌ఎ కెవిఆర్ దొడ్డ మనసు
ఇల్లు, ఇంటి స్థలం విలువ రూ.6 కోట్లపైనే
ఆదర్శంగా నిలిచిన ఎంఎల్ఏ
మన తెలంగాణ/కామారెడ్డి ప్రతినిధి: ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తన సొంత మేనిఫెస్టోను ప్రకటించి అంద ర్నీ సంభ్రమాశ్చర్యాలకు గురిచేసిన బిజెపి నాయకుడు, ప్రస్తుత కామారెడ్డి ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకట రమణారెడ్డి తాజాగా తన గొప్ప మనసును చాటుకున్నారు. రోడ్డు విస్తరణ కోసం తన సొం త ఇంటినే కూల్చివేస్తూ ఆదర్శంగా నిలిచారు. కామారెడ్డి పట్ట ణంలోని పాతబస్టాండు నుంచి అడ్లూరు రోడ్డు వరకు ఎన్నో ఆ టంకాలు ఎదురయ్యాయి. ఇదే రోడ్డులో ఎంఎల్‌ఎ కాటిపల్లి వెం కట రమణారెడ్డి ఇల్లుతోపాటు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ ఇల్లు కూడా ఉంది. ట్రాఫిక్ పెరగడంతో ఈ ఏరియాలో పలు ఆక్రమణలతో రోడ్డు ఇ రుగ్గా మారింది. ఈ నేపథ్యంలో ఎంఎల్‌ఎ కెవిఆర్ తన సొంత ఇంటినే కూల్చేందుకు ముందుకు వచ్చారు. ప్రజా రవాణా స జావుగా సాగేందుకు అధికారుల సమక్షంలో ఆయన తన ఇం టిని, స్థలాన్ని కూలగొట్టించారు. సుమారు వెయ్యి గజాల స్థలం తో పాటు ఇల్లు కలిపి ఆరు కోట్ల రూపాయల విలువ ఉంటుంద ని అంచనా. దీనిని మున్సిపల్ అధికారులకు అప్పగించారు. ప్ర జా శ్రేయస్సే ధ్యేయంగా భావించిన ఆయన సొంత ఇంటితోనే రోడ్డు వెడల్పు పనులు జరిగేందుకు శ్రీకారం చుట్టి, తన దొడ్డ మనసును చాటుకున్నారు. ఇందులో భాగంగానే ఆయన తన ఇంటిని ఖాళీ చేసి రెండు వారాల క్రితమే ఎంఎల్‌ఎ క్యాంపు కా ర్యాలయానికి మకాం మార్చారు. కాగా, కామారెడ్డి రాజకీయ చ రిత్రలో అందరికీ ఆదర్శంగా నిలుస్తున్న ఎంఎల్‌ఎ కాటిపల్లి వెంకట రమణా రెడ్డి తీసుకున్న గొప్ప నిర్ణయాన్ని స్థానికులు వే నోళ్ల పొగుడుతున్నారు.