- Advertisement -
హైదరాబాద్: తెలంగాణలో మెగాడిఎస్ సీ ద్వారా 6 నెలల్లో ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై సౌందర్య రాజన్ పేర్కొన్నారు. ఏడాదిలోగా 2 లక్షల ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టనున్న్టట్లు గవర్నర్ తెలిపారు. మూసీ పరివాహక ప్రాంతాన్ని ఉపాధి కల్పన జోన్ గా మారుస్తామన్నారు. ఇళ్లు నిర్మించుకునే పేదలకు రూ. 5లక్షల ఆర్థికసాయం చేస్తామన్నారు. ఇళ్లు నిర్మించుకునే ఎస్సీ, ఎస్టీలకు రూ. 6 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆమె వెల్లడించారు. 25 లక్షల ఎకరాల భూమిపై పేదలకు పూర్తిస్థాయి హక్కులు కల్పిస్తామన్నారు. గత ప్రభత్వం కార్పొరేషన్లు పేరుతో విచ్చలవిడిగా అప్పులు చేసిందని ఆరోపించారు. అప్పులపై శాఖలవారీగా శ్వేతపత్రాలు విడుదల చేస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అప్పులపై ప్రజలకు వాస్తవాలు చెబుతామని గవర్నర్ పేర్కొన్నారు.
- Advertisement -