Friday, November 22, 2024

ప్రయాణికుల భద్రత కోసం ద.మ. రైల్వే రక్షణ దళం స్పెషల్ డ్రైవ్

- Advertisement -
- Advertisement -

పలువురిపై కేసులు నమోదు.. నగదు, ఇతర వస్తువుల జప్తు

మన తెలంగాణ / హైదరాబాద్ : దక్షిణ మధ్య రైల్వే రక్షణ దళం ( ఆర్.పి.ఎఫ్ ) ప్రయాణికుల రక్షణ భద్రత పట్ల నిబద్ధతకు తిరుగులేని ప్రదర్శనగా డిసెంబర్ 1 నుండి 15వ వరకు పక్షం రోజుల పాటు ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించింది. దక్షిణ మధ్య రైల్వేజోన్ లో విశాలమైన అధికార పరిధి అంతటా ఈ దళం రైల్వే ప్రాంగణంలో నేర కార్యకలాపాలను అరికట్టడంలో శ్రద్ధగా పనిచేస్తూ ప్రశంసనీయమైన విజయాలను సాధించింది. ఆర్.పి.ఎఫ్ బృందాలు రూ.15 లక్షలు కలిగిన 60 కిలోల బరువున్న గంజాయితో సహా గణనీయమైన నిషిద్ధ నిల్వలను విజయవంతంగా జప్తు చేశారు. అదనంగా, వారి అప్రమత్తత ఫలితంగా రూ. 64,523 విలువ చేసే 931 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని 6 మంది వ్యక్తులను అరెస్టు చేశారు.

తద్వారా అక్రమ మాదకద్రవ్యాల రవాణాకు వ్యతిరేకంగా నిర్ణయాత్మక ప్రయత్నాన్ని సూచిస్తుంది. అయితే ఆర్.పి.ఎఫ్ విజయ పరంపర అక్కడతో ముగియలేదు. న్యాయం కోసం నిరంతర ప్రయత్నాల వలన రూ.1,34,340 విలువ కల్గిన రైల్వే సామాగ్రిని దొంగిలించే దుర్మార్గపు కార్యకలాపాలకు పాల్పడిన 24 మంది వ్యక్తులను పట్టుకుని నేరస్థులపై చట్టపరమైన వేగవంతమైన దృఢమైన చర్యలు తీసుకుంది. 635 రైల్వే రిజర్వేషన్ టిక్కెట్ల అనధికార బుకింగ్ 24 కేసులు నమోదు చేయడం ద్వారా రూ. 12,64,984 అంచనా విలువ మొత్తం టిక్కట్లను పట్టుకుంది. వీటితో పాటు 555 మంది వ్యక్తులు ధూమపాన ఉల్లంఘనలకు, మరో 807 మంది అతిక్రమించినందుకు కేసులు నమోదు చేసింది. వాహనాలతో ఎల్.సి. గేట్లను ఢీకొట్టడం నడుస్తున్న రైళ్లపై రాళ్లు రువ్వడం వంటి ప్రమాదకర ప్రవర్తనలకు పాల్పడుతున్న 20 మంది వ్యక్తులకు కఠినమైన చర్యలు తీసుకుంది. సిగ్నల్ కేబుల్లను కత్తిరించడం, కమ్యూనికేషన్ సిస్టమ్లలో జోక్యం చేసుకోన్న 16 మంది వ్యక్తులపైనా కేసులు నమోదు చేసింది. దీనితోపాటు ఫుట్ బోర్డు ప్రయాణించినందుకు 70 కేసులు, మహిళల కోచ్‌లలో ప్రయాణించిన పురుష ప్రయాణికులపై 72 కేసులు రైల్వేలను పరిశుభ్రంగా మార్చే దిశలో రైల్వే ఆవరణలో చెత్తను వేసినందుకు మరో 290 కేసులు నమోదుచేసింది. ఈ సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్, దక్షిణ మధ్య రైల్వే ఐ.జి.కమ్ ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమీషనర్ అరోమా సింగ్ ఠాకూర్‌లు ఈ సందర్భంగా ఆర్.పి.ఎఫ్ బృందాన్ని , సిబ్బందిని ప్రశంశించింది. రైలు వినియోగదారులందరికీ నిరంతరాయ , సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి రైల్వే రక్షణ దళం దృఢంగా ఉందని ఆయన తెలియజేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News