Wednesday, January 22, 2025

గిరిజనుల సంక్షేమానికి పెద్దపీట

- Advertisement -
- Advertisement -

గద్వాల: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గిరిజనుల సంక్షేమానికి పెద్ద పీట వేసిందని, గిరిజన విద్యార్థులు విద్యాభివృద్ధ్ది సాధించేందుకు గిరిజన గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందని, కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. శనివారం తెలంగాణ దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఏర్పాటు చేసిన గిరిజన ఉత్సవం కార్యక్రమం గట్టు మండలం వాయిల్‌కుంట తండాలో జరిగింది. ఈ సందర్భంగా వాయలకుంట తండా వాసులు గిరిజన సాంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ కలెక్టర్‌కు ఘనంగా స్వాగతం పలికి ఆహ్వనించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మారుమూల ప్రాంతాలలో ఉన్న గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అన్ని రకాల సదుపాయాలు కల్పించడం జరిగిందని అన్నారు.

తెలంగాణ ఆవిర్భావం జరిగిన తొమ్మిది సంవత్సరాలు పూర్తి అయినా సందర్భంగా దశాబ్ది ఉత్సవాలు నిర్వహించి ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. రైతులకు 24 గంటలు విద్యుత్, రైతు బీమా, రైతు బంధు, ఆసరా పెన్షన్ , మహిళలకు ఆరోగ్య లక్ష్మీ, కేసీఆర్ న్యూట్రిషియన్ కిట్ , తదితర సంక్షేమ పథకాలు కల్పించి ఆదుకోవడం జరిగిందన్నారు. విద్యారంగంలో అభివృద్ది చెందడానికి గురుకులాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. గ్రామంలో అభివృద్ది కార్యక్రమాలు బాగా జరిగి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు సద్వినియోగపర్చుకోవాలని కోరారు.

ఎంపిపి విజయ్‌కుమార్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు , గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి అభివృద్ధ్ది కార్యక్రమాలు చేపట్టారని తెలిపారు. బాల్య వివాహాలు చేయకుండా ఆడ పిల్లలను బాగా చదివించాలని తల్లిదండ్రులను కోరారు. ఈ సందర్భంగా జిరిగన పూజారులను సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఆనంద్‌గౌడ్, డిపిఓ వెంకట్‌రెడ్డి, తహసీల్దార్ జుబేర్, పంచాయతీ కార్యదర్శి వేముగోపాల్ , సర్పంచ్ కృష్ణవేణి నాయక్, ఉప సర్పంచు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News