Monday, December 23, 2024

ఉరి వేసుకొని నేత కార్మికుని బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

తంగళ్లపల్లి: ఆర్థిక ఇబ్బందులు,అప్పుల బాదతాళలేక నేత కార్మికుడు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండలంలోని పద్మనగర్ గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది.వివరాల్లోకి వెళితే గ్రామానికి చెందిన అంబటి సురేష్ (36) పవర్‌లూం కార్మికునిగా పనిచేస్తున్నాడు.

గత ఏడాది అన్నదమ్ముల ఆస్తి పంపకాలు జరుగగా వచ్చిన ఇల్లును పునర్నిర్మాణం చేసుకున్నాడు.అందుకు గాను అప్పుల పాలయ్యాడు.చాలీచాలని జీతంతో అప్పు ఎలా తీర్చాలంటూ మనోవేదనకు గురయ్యాడు.మెల్లి మెల్లిగా అప్పును తీర్చుదామంటూ భార్యకీర్తన మనోదైర్యం కల్పించింది.

బీడి కార్మికురాలుగా చేస్తున్న ఆమెకు వచ్చే జీతం,పని సరిగా లేకపోవడంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.కాగా మృతునికి భానుష్(8),విగ్నేష్(5) ఇద్దరు కొడుకులున్నారు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News