Friday, December 20, 2024

పెళ్లి కావడం లేదని..యువకుడి బలవన్మరణం

- Advertisement -
- Advertisement -

తొర్రూరు : ఉరి వేసుకొని యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలోని ఫత్తేపురం గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలలోకి వెళితే.. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఫత్తేపురం గ్రామానికి చెందిన కొత్తగట్ల కేదారి(25) గత రెండు సంవత్సరాల నుంచి పెళ్లి చేసుకుందామని చూస్తుండగా, పెళ్లి సంబంధం సెట్ అవ్వడం లేదని, తన తోటి వారికి పెళ్లిళ్లు అవుతున్నాయని తనకు పెళ్లి కావడం లేదని తరుచూ చెప్పుకుంటూ బాధపడుతుండేవాడని స్థానికులు తెలిపారు.

ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఫ్యాన్‌కు చీరతో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకునన్నట్లు మృతిని బంధువులు తెలిపారు.స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతుని తండ్రి యాకన్న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ గండ్రాతి సతీశ్ తెలిపారు. పోస్ట్ మార్టం నిమిత్తం మృతదేహాన్ని స్థానిక ఆసుపత్రికి పోలీసులు తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News