Monday, December 23, 2024

భర్తకు రేప్ శిక్ష నుంచి రక్ష సబబేనా..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : భార్యతో భర్త బలవంతపు లైంగిక చర్యకు దిగితే లేదా బలవంతం చేస్తే సదరు మగవాడు శిక్షార్హుడు అవుతాడా? కాడా అనే విషయం ఇప్పుడు సుప్రీంకోర్టు విచారణకు వచ్చింది. మైనర్ కాని భార్యతో లైంగిక చర్యను రేప్ పరిధిలోకి చేర్చి , విచారణకు పిలిపించవచ్చా? లేదా భార్యభర్తల బంధం అనే పరిగణనతో మినహాయింపు ఇవ్వవచ్చా అనేది మీమాంసకు దారితీసింది. సంబంధిత క్లిష్టమైన అంశంపై ఇప్పటికే పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. వీటిపై రాజ్యాంగ ధర్మాసనాలు వివిధ ఇతర కేసులపై విచారణ ముగిసిన తరువాత త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుంది. సంబంధిత విషయంపై తక్షణ విచారణకు సీనియర్ లాయర్ ఇందిరా జైసింగ్ అభ్యర్థించిన తరువాత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఈ విషయాన్ని తెలిపారు. మేజర్ అయిన భార్యతో భర్త ఆమె సమ్మతి లేకుండా లైంగిక చర్యకు దిగితే అత్యాచారం నేరం పరిధిలో నుంచి తప్పించేందుకు వీలుగా రాజ్యాంగంలో చెల్లుబాటు ఉంది.

దీనిని సవాలు చేస్తూ పలు పిటిషన్లు దాఖలు అయ్యాయి. ఇది ఒక విధంగా వైవాహిక సంబంధిత అత్యాచార విషయం. ఇందులో భార్య భర్తల శారీరక లైంగిక సంపర్క విషయం ప్రస్తావనకు వచ్చింది. సమ్మతి లేకుండా లైంగిక చర్యకు పాల్పడటం రేప్ పరిధిలోకి వస్తుంది. ఇదే దశలో వైవాహిక బంధం కూడా ఇమిడి ఉందని ధర్మాసనంలోని న్యాయమూర్తులు పిఎస్ నరసింహ, మనోజ్ మిశ్రా తెలిపారు. అయితే తాను వెంటనే బాలలపై లైంగిక వేధింపుల విషయంపై విచారణ జరగాలని కోరుతున్నానని లాయర్ జైసింగ్ ధర్మాసనానికి వివరించారు. సంబంధిత పలు విషయాలన్నింటిని త్రిసభ్య ధర్మాసనం విచారిస్తుందని ఈ దశలో ధర్మాసనం తెలిపింది. ఇతర విషయాలపై రాజ్యాంగ ధర్మాసనాలు విచారణలలో ఉన్నందున ఈ కీలక విషయంపై త్రిసభ్య ధర్మాసనం ఏర్పాటు తరువాత విచారణ జరుగుతుందని సిజెఐ చంద్రచూడ్ తెలిపారు.

వైవాహిక సంబంధిత అత్యాచారాలపై ఈ ఏడాది జనవరిలోనే సుప్రీంకోర్టు కేంద్రం సమాదానం కోరింది. దీనిపై కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల మెహతా స్పందించారు. సంబంధిత విషయం చాలా సంక్లిష్టం అని పలు చట్టపరమైన, న్యాయపరమైన, ఇదే దశలో సామాజిక ప్రభావిత అంశాలతో కూడిన పరిస్థితి ఉందని, పూర్తి స్థాయిలో పరిశీలించి కేంద్రం దీనిపై స్పందిస్తుందని మెహతా కోర్టుకు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News