Friday, November 15, 2024

చెన్నైలో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టివేత..

- Advertisement -
- Advertisement -

చెన్నై: చెన్నై అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంలో భారీగా విదేశీ క‌రెన్సీ ప‌ట్టుబ‌డింది. బుధవారం ఉదయం ఎయిర్‌పోర్టు సెక్యూరిటీ విధుల్లో ఉన్న సెంట్ర‌ల్ ఇండ‌స్ట్రియ‌ల్ సెక్యూరిటీ ఫోర్స్ అధికారులు సౌదీ నుంచి వ‌చ్చిన ఓ ప్ర‌యాణికుడిని అనుమానించి త‌నిఖీ చేయగా, అతని వద్ద నుంచి రూ.47లక్షలు విలువైన సౌదీ రియాల్‌లను స్వాధీనం చేసుకున్నారు. పౌడర్ డబ్బాలో దాచి విదేశీ కరెన్సీనీ తరలించేందుకు ప్రయత్నించిన ప్రయాణికుడిని అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Foreign Currency seized at Chennai Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News