Monday, December 23, 2024

శంషాబాద్ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

శంషాబాద్ : శంషాబాద్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుకున్న సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు హైదరాబాద్ నుండి సార్జ వెళ్లేందుకు వచ్చిన ఓ ప్రయాణికు ర్యాలీ వద్ద ఈ విదేశీ కరెన్సీని గుర్తించిన అధికారులు. కరెన్సీ స్వాధీనం చేసుకుని నిందితురాలని విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.. శుక్రవారం అర్ధరాత్రి జి9-459, విమానంలో సార్జా వెళ్లేందుకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు వచ్చిన అరబ్ దేశస్తురాలు జాయిన్ అల్నిసా మహమ్మద్ క్యూమర్ అల్దీన్ (60).

Also Read: సిద్దిపేటలో భారీ ఆగ్ని ప్రమాదం

అయితే ఆమె కదిలికలను గమనించిన సిఐఎస్‌ఎఫ్ ఏఎస్‌ఐ సంపత్ రావు అదుపులోకి తీసుకున్నాడు. ఆమె హైడ్ బాగేజీ తనిఖీ చేయగా అందులో 44,480 (మొత్తం 54 నోట్లు) యునైటెడ్ ఎమిరేట్స్ ధరమ్స్ కనిపించాయి. అయితే కరెన్సీని స్వాధీనం చేసుకున్నారు సిఐఎస్‌ఎఫ్ సెక్యూరిటీ అధికారులు. కరెన్సీ తో పాటు నిందితురాలని ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితురాలని కస్టమ్స్ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు .

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News