Sunday, December 22, 2024

శంషాబాద్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

- Advertisement -
- Advertisement -

Foreign currency seized in Shamshabad airport

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మంగళవారం నాడు కస్టమ్స్ అధికారులు షార్జా నుండి వచ్చిన ప్రయాణికుడి వద్ద 4 వేల అమెరికా డాలర్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీలలో పట్టుబడిన ఈ కరెన్సీ రూ.9 లక్షల 44 వేలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. షార్జా వెళ్లేందుకు హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్న మహమూద్ ఆలీ అనే ప్రయాణీకుడు అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా యూఎస్ డాలర్స్‌ను లగేజ్ బ్యాగ్‌లో దాచి తరలించే యత్నం చేశాడు. బ్యాగ్ లో దాచిన విదేశీ కరెన్సీని తనిఖీలలో గుర్తించిన కస్టమ్స్ అధికారులు ప్రయాణీకుడు మహమూద్‌ఆలీపై ఫేమా చట్టం కింద అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని కస్టమ్స్ అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News