Monday, December 23, 2024

శంషాబాద్‌లో బంగారం, అమెరికన్ డాలర్ల స్వాధీనం..

- Advertisement -
- Advertisement -

Foreign currency in Shamshabad Airport

మనతెలంగాణ/హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం కస్టమ్స్ అధికారులు ఓ ప్రయాణికుడి నుంచి రూ.29.44లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. అలాగే దుబాయి నుంచి వచ్చిన మరో వ్యక్తి నుంచి రూ. 18.18లక్షల విలువైన బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమాలియా దేశానికి చెందిన ఓ ప్రయాణికుడి నుంచి విదేశీ కరెన్సీ స్వాధీనం చేసుకున్నారు. షార్జా వెళ్లేందుకు వచ్చిన అతని నుంచి రూ.29.44లక్షల విలువ చేసే 40వేల అమెరికన్ డాలర్లు పట్టుకున్నారు. ప్రయాణికుడిని అదుపులోకి తీసుకుని నగదు సీజ్ చేశారు.బంగారం, విదేశీ కరెన్సీ తరిలిస్తూ పట్టుబడిన నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.

Foreign currency Seized in Shamshabad Airport

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News