Tuesday, January 21, 2025

శంషాబాద్ ఎయిర్‌పోర్టులో విదేశీ నగదు పట్టివేత

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: శంషాబాద్ ఎయిర్ పోర్టులో ఓ ప్రయాణికుడి నుంచి భారీ ఎత్తున విదేశీ నగదును సిఐఎస్‌ఎఫ్ ఇంటెలీజెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఆ వ్యక్తి నుంచి 21లక్షల విదేశీ కరెన్సీ నోట్లు స్వాధీనం చేసుకున్నారు. కురేష్ యాకుబ్బాయి ఉదయం శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి సింగపూర్‌కు వెళ్లేందుకు ఎయిర్ పోర్టుకు వచ్చాడు. పోలీసులు తనిఖీ చేయగా అతడి వద్ద భారీగా విదేశీ కరెన్సీ లభ్యమైంది. డబ్బులకు సరైన ఆధారాలు చూపించకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. వెంటనే సిఐఎస్‌ఎఫ్ అధికారులు కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. వారు కురేష్‌ను విదేశీ నగదు గురించి వివరాలు అడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News