Monday, December 23, 2024

విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండి: టామ్ కామ్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశీ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోండని టామ్ కామ్ సంస్థ ఒక ప్రకటనలో పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వంలోని కార్మిక ఉపాధి కల్పన శాఖ కింద రిజిస్ట్రర్డ్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ అయిన తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ కంపెనీ లిమిటెడ్ ( టామ్ కామ్) ఈ మేరకు విదేశీ ఉద్యోగాల సమాచారాన్ని అందజేస్తోంది. ఈ క్రమంలో టామ్ కామ్ గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, హంగేరి, కెనడా, జర్మనీ, జపాన్ , యూకే వంటి వివిధ దేశాలలో వివిధ ప్రభుత్వ , ప్రైవేటు రిజిస్ట్రర్డ్ ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుంది.

Also Read:ఆరోగ్య శాఖలో 1,442 అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఎంపిక జాబితా విడుదల

టామ్‌కామ్ ప్రస్తుతం జర్మనీలో సాఫ్ట్‌వేర్ డెవలపర్, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్, సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్‌లు, నెట్ వర్క్ అడ్మినిస్ట్రేటర్‌లు, ప్రాజెక్టు మేనేజర్ కోసం నియామక ప్రక్రియను సులభతరం చేస్తోంది. ఈ ఉద్యోగానికి అర్హత సాధించడానికి, అభ్యర్థి సంబంధిత రంగంలో 3 నుండి 5 సంవత్సరాల అనుభవంతో గ్రాడ్యుయేట్ అయి ఉండాలని టామ్ కామ్ వెల్లడించింది. ఈ ఉద్యోగాల పట్ల ఆసక్తి ఉండి అర్హత కలిగిన అభ్యర్థులు టామ్ కామ్ వెబ్ సైట్ లేదా మొబైల్ యాప్‌లో తమ పేర్లు నమోదు చేసుకోవాలని తెలిపింది. అంతే కాకుండా www.tomcom.telangana.gov.in ని సంప్రదించాలని తెలిపింది. మరిన్ని వివరాల కోసం ఫోన్ నంబర్లు 9849639539 లో సంప్రదించాలని వెల్లడించింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News