Thursday, January 23, 2025

విదేశీ ఉద్యోగ అవకాశాలను వినియోగించుకోండి: టామ్ కామ్ సిఈవో

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశాలలోని ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని టామ్‌కామ్ సీఈవో గురువారం నాడొక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్ పవర్ వర్కింగ్ కంపెనీ లిమిటెడ్ (టామ్‌కామ్) తెలంగాణ ప్రభుత్వం లోని కార్మిక, ఉపాధి శిక్షణ కర్మాగారాల శాఖ క్రింద ఒక రిజిసర్డ్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీ అని, తెలంగాణా నుండి అర్హత నైపుణ్యం కలిగిన సెమీ స్కిల్డ్ కార్మికులకు విదేశీ ప్లేస్‌మెంట్‌ను సులభతరం చేయడానికి ఇది కృషిచేస్తున్నదని తెలిపారు. ఈ టామ్‌కామ్ గల్ఫ్ దేశాలతో పాటు ఆస్ట్రేలియా, కెనడా, జర్మనీ, హంగేరి, జపాన్, పోలాండ్, రొమేనియా యూకే వంటి వివిధ దేశాలలో వివిధ ప్రభుత్వ ప్రైవేట్ నమోదిత ఏజెన్సీలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకుందన్నారు.

డ్రైవర్లు, వెల్డర్లు వంటి స్థానాలకు గాను అభివృద్ధి చెందిన దేశాలలో నైపుణ్యం కలిగిన కార్మికులకు అధిక డిమాండ్‌ఉందన్నారు. ఈ ఉద్యోగాలు ఆకర్షణీయమైన జీతం ప్యాకేజీతో వస్తాయన్నారు. సురక్షితమైన చట్టబద్ధమైన వలస మార్గాల ద్వారా రిక్రూట్‌మెంట్ ప్రక్రియను సులభతరం చేయడంలో అభ్యర్థులకు టామ్ కామ్ సహాయం చేస్తుందన్నారు. ఈనేపథ్యంలో ఆయా ఖాళీల కోసం అభ్యర్థులను ఎంపిక చేసేందుకు ఈ నెల 29న హైదరాబాద్ విజయ నగర్ కాలనీలోని ప్రభుత్వ ఐటిఐ కళాశాలలో ఉన్న
టామ్‌కామ్ ఆఫీస్ నందు ఎన్‌రోల్ మెంట్‌ను నిర్వహించనుందన్నారు. ఈ అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకుని విదేశీ ఉద్యోగాలను పొందాలన్నారు.

ముఖ్యంగా మలేషియాలో చేరిన ఉద్యోగులకు ఆహారం, వసతి, విమాన టిక్కెట్లు అందుతాయన్నారు. ఈ స్థానాలకు అర్హత సాధించడానికి, అభ్యర్థి తప్పని సరిగా సంబంధిత అనుభవంతో పాటు పాస్‌పోర్టు కనీసం రెండు సంవత్సరాలు చెల్లుబాటుతో ఉండాలని తెలిపారు. మరిన్ని వివరాల కోసం అభ్యర్ధులు టామ్‌కామ్ వెబ్ సౌట్ లేదా www.tomcom.telangana.gov.in ని గానీ లేదా మొబైల్ నెంబర్లు 7893566493 / 99519 09863 / 83286 02231లను గాని సంప్రదించాలని వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News