Monday, December 23, 2024

మోడీ ప్రమాణ స్వీకారోత్సవానికి విదేశీ నేతలు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ :దేశ ప్రధానిగా మూడోసారి నరేంద్రమోడీ శనివారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ మహోత్సవానికి విదేశీ నేతలు హాజరుకానున్నారు. పొరుగుదేశాలైన బంగ్లాదేశ్, శ్రీలంక, భూటాన్, నేపాల్, మారిషస్ అధినేతలకు మన ప్రభుత్వం నుంచి ఆహ్వానాలు అందవచ్చని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా, శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘే, నేపాల్ ప్రధాని పుష్ప కమల్ దహల్ ‘ప్రచండ’ , భూటాన్ ప్రధాని షెరింగ్ తొబ్‌గే, మారిషస్ ప్రధాని ప్రవింద్ జుగ్‌నాథ్, హాజరు కానున్నట్టు తెలుస్తోంది.

శ్రీలంక అధ్యక్షులు రణిల్ విక్రమ్ సింఘేకు ఇప్పటికే ఆహ్వానం అందిందని శ్రీలంక అధ్యక్షుడి మీడియా కార్యాలయం వెల్లడించింది. దానిని తమ అధ్యక్షుడు అంగీకరించారని తెలిపింది. అలాగే బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాతో మోడీ ఫోనులో మాట్లాడారని ప్రమాణస్వీకారానికి ఆహ్వానించారని దౌత్యవర్గాలు తెలిపాయి. పొరుగు దేశమైన పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్‌కు మాత్రం ఇంకా మోడీ నుంచి ఆహ్వానం అందలేదు. జూన్ 10 వరకు చైనా పర్యటనలో షెహబాజ్ ఉంటున్నందున జూన్ 8 నాటి ప్రమాణ స్వీకారానికి ఆయన హాజరు కాలేకపోవచ్చని తెలుస్తోంది.2014 లో మోడీ మొదటిసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు అప్పటి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్‌తోపాటు సార్క్ నేతలంతా పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News