Thursday, December 19, 2024

పాక్ ఉపప్రధానిగా ఇశాక్ నియామకం

- Advertisement -
- Advertisement -

పాకిస్థాన్ ఉప ప్రధానిగా ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి ఇశాక్ డార్ నియమితులయ్యారు. ఈమేరకు కేబినెట్ డివిజన్ ఆదివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. పీఎం ఎల్ ఎన్ పార్టీకి చెందిన సీనియర్ నేత , ఛార్టెడ్ అకౌంటెంట్ అయిన ఇశాక్ డార్ (73)ను ఉప ప్రధానిగా ప్రధాని షెహబాజ్ షరీఫ్ నియమించినట్టు నోటిఫికేషన్‌లో పేర్కొన్నారు. ఈ నియామకం తక్షణమే అమలు లోకి వస్తుందని తదుపరి ఆదేశాలు వచ్చేవరకు ఆయన ఈ పదవిలో కొనసాగుతారని స్పష్టం చేశారు. షరీఫ్ కుటుంబానికి సన్నిహితుడైన డార్ గతంలో రెండు సార్లు ఆర్థిక మంత్రిగా సేవలందించారు. ఈ ఏడాది జరిగిన పాకిస్థాన్ జనరల్ అసెంబ్లీ ఎన్నికల్లో పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ ) మద్దతుతో షెహబాజ్ షరీఫ నేతృత్వంలో పీఎంఎల్ (ఎన్) ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News