Wednesday, January 1, 2025

చర్చలవైపు

- Advertisement -
- Advertisement -

Foreign Minister of Russia and Ukraine will meet March 10th

10న రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రుల భేటీ
ఫలించిన టర్కీ దౌత్యం
పుతిన్, జెలెన్‌స్కీలకు ప్రధాని మోడీ ఫోన్
శాంతి చర్చల కొనసాగింపుపై హర్షం.. హూతీకెయిన్‌లో పరిస్థితిపై ఆరా
సుమీలోని భారతీయుల తరలింపునకు సహకరించాలని అభ్యర్థన

అంకారా/న్యూఢిల్లీ: రష్యా-ఉక్రెయిన్ వివాదం ముగింపు కోసం తమ దేశ అధ్య క్షుడు రెసెప్ తైపీ ఎర్డోగన్ తీసుకున్న చొరవ , దౌత్యయత్నాల ఫలితంగా రష్యా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రులు సెర్గీలా వ్రోవ్, దిమిత్రీ కులేబాలు సమావేశ మయ్యేందుకు అంగీకరించారని టర్కీ వి దేశాంగ మంత్రి మెవ్లుట్ కావుసోగ్లు సో మవారం ప్రకటించారు. అంటల్యా డి ప్లొమసీ ఫోరం వేదికగా ఈ నెల 10న నిర్వహించే ఈ కార్యక్రమంలో తాను కూ డా భాగస్వామి అవుతున్నటు ్లఆయన ట్వీట్ చేశారు. ప్రయత్నాలు శాంతి, స్థిరత్వానికి దోహదం చేస్తాయని ఆశి స్తున్నట్లు తెలిపారు. రష్యా కూడా ఈ వి షయాన్ని ధ్రువీకరించింది.

ప్రధాని నరేంద్ర మోడీ సో మవారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పు తిన్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీలతో విడివిడిగా ఫోన్‌లో మాట్లాడారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో మోడీ దాదాపు గంట సేపు ఉక్రెయిన్ అంశంపై మాట్లాడారు. ఉక్రెయిన్ష్య్రా మధ్య చర్చల స్థితిని ఈ సందర్భంగా పుతిన్ మోడీకి వివరించారు. ఇరుపక్షాల ప్రతినిధుల మధ్య జరుగుతున్న చర్చలతో పాటుగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో నేరుగా చర్చలు జరపాలని ఈ సందర్భంగా మోడీ పుతిన్‌ను కోరారు. సుమీతో పాటుగా ఉక్రెయిన్‌లోని ఆయా ప్రాంతాల్లో కాల్పుల విరమణ ప్రకటించడం, మానవతా కారిడార్‌ల ఏర్పాటుపై రష్యాను ప్రధాని అభినందించారు. ముఖ్యంగా సుమీనుంచి భారతీయులతరలింపు అవసరాన్ని మోడీ నొక్కి చెప్పారు. రష్యాఉక్రెయిన్‌ల మధ్య భీకర పోరు కారణంగా సుమీలో దాదాపు 700 మంది భారతీయులు చిక్కుపడిన విషయం తెలిసిందే. ఈ విషయమై తమవంతు సహకారాన్ని అందిస్తామని పుతిన్ ప్రధాని మోడీకి హామీ ఇచ్చారు.

అంతకు ముందు ప్రధాని మోడీ ఉక్రెయిన్ అద్యక్షుడు జెలెన్‌స్కీతో కూడా ఫోన్‌లో మాట్లాడారు. దాదాపు 35 నిమిషాల పాటు సాగిన ఈ ఫోన్ సంభాషణలో భాగంగా ఉక్రెయిన్‌లో పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించినట్లు సమాచారం. రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతిచర్చలు కొనసాగడాన్ని ప్రధాని మోడీ అభినందించారు. దీంతో పాటుగా ఉక్రెయిన్‌నుంచి భారతీయ పౌరులను తరలించడంలో అందించిన సహకారానికి జెలెన్‌స్కీకి ప్రధాని మోడీ కృతజ్ఞతలు తెలియజేశారు. సుమీలో చిక్కుపడిన మిగతా భారతీయుల తరలింపునకూ సహకారం కావాలని కోరారు. ఉక్రెయిన్ ప్రజలకు భారత్ అందిస్తున్న మద్దతుకు జెలెన్‌స్కీ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య ప్రారంభమైనప్పటినుంచి ప్రధాని మోడీ ఈ రెండు దేశాల నేతలతో ఫోన్‌లో మాట్లాడడం ఇది రెండో సారి కావడం గమనార్హం.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News