ముంబై: కరోనా వైరస్ దెబ్బకు అర్ధాంతరంగా ఆగిపోయిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపిఎల్) మిగిలిన దశ మ్యాచ్‌లను యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యుఎఇ) వేదికగా నిర్వహించాలని భారత క్రికెట్ బోర్డు నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే యుఎఇలో జరిగే ఐపిఎల్‌లో పలు దేశాలకు చెందిన విదేశీ క్రికెటర్లు పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ తదితర దేశాలకు చెందిన క్రికెట్ బోర్డులు ఐపిఎల్ రెండో దశకు తమ క్రికెటర్లను పంపించే ప్రసక్తేలేదని స్పష్టం చేశాయి. అయితే ఆయా బోర్డులను ఒప్పించే ప్రయత్నాల్లో భారత క్రికెట్ ఉంది. కానీ ఆ చర్చలు ఓ కొలిక్కి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ క్రికెటర్లకు షాక్ ఇచ్చేందుకు భారత్ క్రికెట్ బోర్డు(బిసిసిఐ) సిద్ధమైనట్టు తెలిసింది. మిగిలిన దశ ఐపిఎల్‌కు దూరంగా ఉండే విదేశీ క్రికెటర్ల జీతాల్లో భారీ కోత విధించాలని బిసిసిఐ భావిస్తోంది. ఒకవేళ ఎవరైనా టోర్నీకి దూరమైతే ఆడిన మ్యాచ్‌లకు మాత్రమే వేతనాలు చెల్లిస్తారు. ఆడని మ్యాచ్‌లకు జీతాలు ఇచ్చే ప్రసక్తే ఉండదని బిసిసిఐకి చెందిన ఒక ఉన్నతాధికారి స్పష్టం చేశారు.
Foreign Players salary will cut if not come to UAE