Monday, December 23, 2024

రూ.18,617 కోట్ల విదేశీ పెట్టుబడులు

- Advertisement -
- Advertisement -

ముంబై : మే నెలలో విదేశీ పెట్టుబడిదారులు జోరు పెంచారు. ఈ నెలలో 8 నుంచి 12వ తేదీ వరకు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పిఐ) దాదాపు రూ.18,617 కోట్ల విలువచేసే ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ వి.కె.విజయ్ కుమార్ మాట్లాడుతూ, భారతదేశం పట్ల ఎఫ్‌పిఐ వ్యూహంలో మార్పు స్పషంగా తెలుస్తోందని అన్నారు. భారతీయ ఈక్విటీ షేర్ల విలువ గరిష్ఠానికి చేరడంతో 2023 మొదటి మూడు నెలల్లో ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లు అమ్మకాలను కొనసాగించారు. మరోవైపు చైనాలో కరోనా లాక్‌డౌన్ తగ్గి మళ్లీ పనులు ప్రారంభించడంతో ఇన్వెస్టర్లు బీజింగ్ వైపు మొగ్గుచూపారు.

కానీ ఇప్పుడు ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్లకు వర్ధమాన దేశాల్లో భారత్ మరోసారి అనుకూలమైన దేశంగా మారిందని విజయ్‌కుమార్ అన్నారు. గత 12 ట్రేడింగ్ సెషన్లను చూస్తే విదేశీ ఇన్వెస్టర్లు వరుసగా కొనుగోలుదారులుగా ఉన్నారు. ఈ నెలలో 12వ తేదీ వరకు రూ.18,617 కోట్ల విలువ ఈక్విటీ షేర్లను కొనుగోలు చేశారు. ఆర్థిక రంగం ఇప్పటికీ ఎఫ్‌పిఐ ఇన్వెస్టర్ల ఇష్టమైన సెక్టార్‌గా ఉంది. ఇంకా క్యాపిటల్ గూడ్స్, ఆటో సెక్టార్‌పైనా వారు దృష్టిపెట్టారు. రూపాయి బలపడడం, డాలర్ విలువ సమీప భవిష్యత్‌లో క్షీణిస్తుందని అంచనా నేపథ్యంలో ఎఫ్‌పిఐలు భారత్‌లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారు.

అదే సమయంలో భారతదేశంలో స్థూల ఆర్థిక అంశాలు మెరుగవడడం కూడా విదేశీ పెట్టుబడుల ప్రవాహానికి కారణమైంది. ఏప్రిల్‌లో ఆఖరి వారాల్లో విదేశీ పెట్టుబడుల ప్రవాహం ప్రారంభమైంది. ఏప్రిల్‌లో 29వ తేదీవరకు రూ.9,752 కోట్ల విలువ ఎఫ్‌పిఐ పెట్టుబడులు వచ్చాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News