Sunday, December 22, 2024

అక్టోబర్ 1 నుంచి టూరిజం మరింత ప్రియం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : విదేశీ పర్యటన ప్యాకేజీలు అక్టోబర్ 1 నుండి మరింత ప్రియం కానున్నాయి. విదేశాలకు వెళ్లేందుకు టూర్ ప్యాకేజీపై రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేసే వారు 20 శాతం టిసిఎస్ (టాక్స్ కలెక్షన్ ఎట్ సోర్స్) చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇది 5 శాతంగా ఉంది. ఆర్‌బిఐ ఎల్‌ఆర్‌ఎస్ (లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్) కింద అక్టోబర్ 1 నుండి విదేశీ రెమిటెన్స్‌లపై 20 శాతం టిసిఎస్ చెల్లించాల్సి ఉంటుంది, దానిపై ఇప్పటి వరకు 5 శాతం టిసిఎస్ ఉంది. ఈ నిబంధనను 2023 జూలై 1 నుండి అమలు చేయాల్సి ఉంది.

అయితే ప్రభుత్వం మూడు నెలల పొడిగింపు ఇచ్చింది. అక్టోబర్ 1 నుండి అమలు చేయాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం టూర్ ప్యాకేజీతో విదేశాలకు వెళ్లే వారినే ఎక్కువగా దెబ్బతీయనుంది. రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖరీదు చేసే టూర్ ప్యాకేజీలపై 20 శాతం టిసిఎస్ పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఓవర్సీస్ టూర్ ప్యాకేజీలపై 20 శాతం టిసిఎస్‌ను రద్దు చేయాలని ట్రావెల్ ఏజెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. దీంతో దేశీయ టూర్ ఆపరేటర్లు నష్టపోతారని అంటున్నారు.

ఈ నిర్ణయం విదేశాల్లో వైద్యం లేదా విద్యపై రూ.7 లక్షల కంటే ఎక్కువ ఖర్చు చేయదు. అయితే పాత పాలన మాదిరిగానే, రూ. 7 లక్షల కంటే ఎక్కువ వైద్య, విద్య ఖర్చులపై 5 శాతం టిసిఎస్ విధిస్తారు. 2023-24 ఆర్థిక సంవత్సరానికి ఫిబ్రవరి 1న సమర్పించిన బడ్జెట్‌లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ఈ ప్రకటన చేశారు. విదేశీ టూర్ ప్యాకేజీలు, ఎల్‌ఆర్‌ఎస్ కింద విదేశాలకు పంపే డబ్బుపై టిసిఎస్ రేటును 5 శాతం నుండి 20 శాతానికి పెంచుతున్నట్లు ప్రకటించారు. ఇది జూలై నుండి అమలు చేయాల్సి ఉంది, కానీ ప్రభుత్వం మూడు నెలల పొడిగింపును ఇచ్చింది. టిసిఎస్ రేటు తగ్గించాలన్న డిమాండ్‌ను ప్రభుత్వం పూర్తిగా తోసిపుచ్చింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News