Monday, December 23, 2024

విదేశీ వర్శిటీలు వస్తున్నాయ్!

- Advertisement -
- Advertisement -

విధివిధానాలతో ముసాయిదా విడుదల చేసిన యుజిసి

18వరకు అభ్యంతరాలు, సలహాలు, సూచనలు స్వీకరణ జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా
ఏర్పాటు యుజిసి అనుమతి తప్పనిసరి హర్షం వ్యక్తం చేసిన యుజిసి చైర్మన్ ప్రొ. జగదీశ్ మామిడాల
విద్యార్థులకు తక్కువ ఖర్చుతో విదేశీ విద్యను అందించడమే లక్షమని ప్రకటన

 

మన దేశంలో విదేశీ యూనివర్శిటీల ఏర్పాటును స్వాగతిస్తున్నామని యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్(యుజిసి) చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ మామిడాల వెల్లడించారు. విదేశీ విద్యను మన దేశ విద్యార్థులకు చేరువ చేయడం దీ ని ఉద్దేశ్యమని పేర్కొన్నారు. వివిధ దేశాలకు చెంది న ప్రముఖ యూనివర్శిటీలు మనదేశంలో క్యాంపస్‌లు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు. విదేశీ వర్శిటీ ఏర్పాటుపై గురువారం యుజిసి చైర్మన్ ప్రొఫెసర్ జగదీశ్ మా మిడాల మీడియా ప్రతినిధులతో జూమ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన విద్యా మన దేశ విద్యార్థులకు విదేశీ విద్య అవసరం, తదితర అంశాలను వివరిస్తూ మీడియా ప్రతినిధులు అడిగిన పలు ప్రశ్నలకు స మాధానం ఇచ్చారు.

విదేశాలలో చదువుకోవడానికి ఏటా మన నుంచి సుమారు 4.5 లక్షల మం ది విద్యార్థులు వెళుతున్నారని, దేశంలోనే విదేశీ వ ర్శిటీలు ఏర్పడితే వారికి నివాస వ్యయం, ట్యూషన్ ఫీజు తగ్గి తక్కువ ఖర్చుతో వారు కోరుకున్న విద్యను అభ్యసరించగలుగుతారని చైర్మన్ తెలిపా రు. విదేశీ వర్శిటీలు దేశంలో తమ క్యాంపస్‌లు ఏ ర్పాటు చేయాలనుకుంటే తప్పనిసరిగా యుజిసి అ నుమతి తీసుకోవాలని పేర్కొన్నారు. యుజిసి అనుమతి లేకుండా ఏ విదేశీ యూనివర్శిటీ క్యాంపస్‌ల ను ఏర్పాటు చేయదని స్పష్టం చేశారు. భారతదేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేసే విదేశీ విశ్వవిద్యాలయాలు తమ స్వంత ప్రవేశ ప్రక్రియను రూపొందించుకునే స్వేచ్ఛను కలిగి ఉంటాయని పేర్కొన్నారు. దేశంలో ఏర్పాటయ్యే విదేశీ వర్శిటీలు వాటి ప్రధాన క్యాంపస్‌లలో రెండు సార్లు ప్రవేశాలు చేపట్టే విధానం ఉంటే, మనదేశంలో కూడా ఆ విధానం అమలు చేసుకోవచ్చని అన్నారు. అలాగే విద్యార్థులకు పార్ట్‌టైం ఉద్యోగాల కల్పనకు అవకాశం కల్పిస్తామని చెప్పారు.

విదేశీ వర్శిటీలలో ప్రవేశాలు పొందాలనుకునే మనదేశ విద్యార్థులలో ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన వారు ఉంటే, వారికి వివిధ మార్గాలలో ఆర్థిక సహాయం అందించే విధంగా వెలుసుబాటు కల్పిస్తామని తెలిపారు. ఈ విశ్వవిద్యాలయాలు ఆన్‌లైన్ లేదా దూర విద్యను అందించలేవని, కేవలం ఆఫ్‌లైన్‌లో రెగ్యులర్ విద్యను అందించే కోర్సులు మాత్రమే అందించాలని తెలిపారు. దేశంలో క్యాంపస్‌లను ఏర్పాటు చేయడానికి విదేశీ విశ్వవిద్యాలయాలు పదేళ్ల కాలానికి ప్రాథమిక అనుమతి పొందుతాయని చెప్పారు. ఫారిన్ ఎక్స్‌ఛేంజ్ మేనేజ్‌మెంట్ యాక్ట్(ఫెమా) చట్టం ప్రకారం నిధుల తరలింపు ఉంటుందని అన్నారు. మనదేశంలో క్యాంపస్‌లలో ఏర్పాటు చేసే విదేశీ వర్శిటీలు తమ ప్రధాన క్యాంపస్‌తో సమానంగా నాణ్యత ఉండేలా ఉండేలా చూసుకోవాలని పేర్కొన్నారు. విదేశీ యూనివర్శిటీల ఏర్పాటుపై అభిప్రాయాలు స్వీకరించి, వాటిని పరిశీలించిన తర్వాత తుది ముసాయిదా విడుదల చేస్తామని వెల్లడించారు.

ముసాయిదాపై సలహాలు, సూచనల స్వీకరణ

భారత్‌లో విదేశీ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన విధివిధానాలతో ముసాయిదాను యుజిసి గురువారం వెబ్‌సైట్‌లో పొందుపరించింది. దీనిపై ఈ నెల 18వ తేదీ వరకు ugcforegncollaboration@gmail.com అనే ఈమెయిల్‌కు సలహాలు, సూచనలు పంపాలని యుజిసి కోరింది. జాతీయ విద్యా విధానం -2020 సిఫార్సుల మేరకు విదేశీ యూనివర్శిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీని ప్రకారం విదేశీ యూనివర్శిటీలు భారత్‌లో క్యాంపస్‌లు ఏర్పాటు చేసుకునే వీలుంది. దేశంలో విదేశీ వర్శిటీలు ఏర్పాటు చేయాలనుకునే సంస్థలు ముందుగా యుజిసి అనుమతికి దరఖాస్తు చేసుకోవాలని ముసాయిదాలో పేర్కొన్నారు.

యుజిసి నేతృత్వంలోని పాలకమండలి మౌలిక వసతులు, ఫ్యాకల్టీ, కోర్సుల ప్రతిపాదనను పరిశీలించి అనుమతి ఇస్తుంది. దరఖాస్తు చేసిన 45 రోజుల్లో అనుమతులు లభిస్తాయి. కమిషన్ సూచించిన సమయంలో క్యాంపస్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ప్రవేశాలకు సంబంధించిన వివరాలు, కోర్సులు, ఫీజులకు సంబంధించి వివరాలను ప్రవేశాలకు 60 రోజుల ముందే విదేశీ యూనివర్శిటీ స్థాపించే సంస్థలు వెల్లడించాల్సి ఉంటుంది. డిగ్రీ, డ్యూయల్ డిగ్రీలను నిర్వహించేందుకు అనుమతిస్తారు. ప్రతీ సంవత్సరం వార్షిక నిర్వహణ పద్దులను సమర్పించాల్సి ఉంటుంది. ముసాయిదాకు సంబంధించిన సూచనలు, సలహాలను బట్టి తుది మార్గదర్శకాలు వెలువడనున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News