Wednesday, January 22, 2025

డ్రగ్స్ కేసులో విదేశీ మహిళకు 10 ఏళ్ల జైలు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : విదేశాల నుంచి హేరాయిన్ మత్తు పదార్ధాన్ని నగరానికి తీసుకువచ్చిన జాంబియా దేశస్థురాలికి మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టు 10 సంవత్సరాలు జైలు, లక్ష జరిమానాను విధించింది. 2021 జులై 19వ తేదిన జాంబియా కు చెందిన మహిళ దాదాపు 20 కోట్లు విలువ చేసే మత్తు పదార్ధం 3200 గ్రాముల హేరాయిన్ ను తీసుకువచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు డిఆర్‌ఐ అధికారులు ఆమెను అరెస్టు చేశారు. విచారణలో డిఆర్‌ఐ అధికారులు పూర్తి సాక్ష్యాధారాలతో డ్రగ్స్ సరఫరాను నిరూపించడంతో న్యాయమూర్తి 10 ఏండ్లు జైలు శిక్ష విధించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News