Monday, December 23, 2024

తీవ్ర నేరాల్లో ఫోరెన్సిక్ దర్యాప్తు తప్పనినరి చేస్తాం : అమిత్‌షా

- Advertisement -
- Advertisement -

Forensic investigation will be done in serious crimes: Amit Shah

గాంధీనగర్ : ఆరేళ్లకు పైగా శిక్ష పడే అవకాశం ఉన్న నేరాల విషయంలో ఫోరెన్సిక్ దర్యాప్తు ను చట్టబద్ధం, తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం లక్షంగా పెట్టుకున్నట్టు కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా వెల్లడించారు. ఫోరెన్సిక్ సైన్స్ లో భారత్ గ్లోబల్ హబ్‌గా మారుతుందని తెలిపారు. గుజరాత్ గాంధీనగర్ లోని నేషనల్ ఫోరెన్సిక్ సైన్సెస్ యూనివర్శిటీ మొదటి స్నాతకోత్సవంలో ఆదివారం షా ప్రసంగించారు. ప్రతిజిల్లాల్లో ఫోరెన్సిక్ మొబైల్ ఇన్వెస్టిగేషన్ సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. దర్యాప్తులో స్వతంత్రత, నిష్పక్షపాత వైఖరి ఉండేలా చట్టబద్ధమైన నిర్మాణాన్ని రూపొందిస్తుందని తెలిపారు. ప్రధాని నరేంద్రమోడీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం, భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, సాక్షాధారాల చట్టంలో మార్పులు చేయనుంది.

ఈ చట్టాలను స్వతంత్ర భారత దృష్టి కోణం నుంచి పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమం లోనే నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నాం అని అమిత్‌షా తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఎన్‌ఎఫ్‌ఎస్ యులో డీఎన్‌ఏ ఫోరెన్సిక్స్, సైబర్ సెక్యూరిటీ, ఇన్వెస్టిగేటివ్, ఫోరెన్సిక్ సైకాలజీలో ఏర్పాటు చేసిన మూడు ఎక్స్‌లెన్స్ కేంద్రాలను మంత్రి ప్రారంభించారు. ఈ మూడు సెంటర్‌లు విద్య, శిక్షణతోపాటు పరిశోధన, అభివృద్ధికి ముఖ్య కేంద్రాలుగా మారతాయన్నారు. అంతకు ముందు వెయ్యిమంది విద్యార్థులకు మాస్టర్స్ డిగ్రీలు ప్రదానం చేశారు. దేశాభివృద్ధి కోసం కృషి చేయాలని వారికి పిలుపునిచ్చారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News