Monday, November 18, 2024

అటవీ సంరక్షణ సవరణ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : అటవీ సంరక్షణ సవరణ బిల్లు బుధవారం లోక్‌సభలో ఆమోదమైంది. దేశ సరిహద్దుల వద్ద సుమారు వంద కిలోమీటర్ల పరిధి వరకు ఉన్న అటవీ సంరక్షణ చట్టాల్ని మినహాయించాలని, ఆ ప్రాంతాల్లో ఉన్న అడవుల్లో జూలు, సఫారీలు, ఎకోటూరిజం సౌకర్యాలను ఏర్పాటు చేసే విధంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. స్వల్పకాల చర్చ తరువాత అటవీ పరిరక్షణ సవరణ బిల్లు 2023 కి ఆమోదం తెలిపారు.

పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ ఈ బిల్లుపై మాట్లాడారు. అంతర్జాతీయ సరిహద్దు , నియంత్రణ రేఖ , వాస్తవాధీన రేఖకు 100 కిమీ రేంజ్‌లో ఉన్న అడవుల్లో జాతీయ ప్రాముఖ్యత కలిగిన ప్రాజెక్టులు నిర్మించే రీతిలో చట్టాన్ని సవరించారు. బిల్లు ఆమోదం పొందిన తరువాత లోక్‌సభ గురువారానికి వాయిదా పడింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News