Friday, December 20, 2024

తలకిందులుగా గంటలు గంటలు

- Advertisement -
- Advertisement -

వాషింగ్టన్ : అమెరికాలోని మియామీలోని క్రెన్డాన్ పార్క్‌లో రంగులరాట్నంలో చక్కర్లు ఎనమండుగురికి గంటల తరబడి తలకిందుల యాతన చూపింది. విస్కాన్సిన్ ప్రాంతంలోని క్రెన్డాన్‌లో అటవీ ప్రాంత కౌంటీ ఉత్సవాలు ఘనంగా సాగుతాయి. ఇందులో పలు ఆకర్షణలతో పాటు యాంత్రిక రంగులరాట్నంలో కూర్చుని వేలాది మంది ఆనందిస్తూ ఉంటారు. అయితే రెండు మూడురోజుల క్రితం ఈ ఫైర్‌బాల్ రోలర్ కోస్టర్‌లో తలెత్తిన యాంత్రిక లోపంతో దీనిలోని ఎనమండుగురు గంటల తరబడి ఆకాశంలో తలకిందులుగా వేలాడుతూ ఉండాల్సివచ్చిందని స్థానిక అధికారులు తెలిపారు. చాలా సేపటివరకూ వీరు ఇందులోనే బందీలుగా ఉండిపొయ్యారు.

రంగులరాట్నం గిర్రున గుండ్రంగా తిరిగే క్రమంలో ఇది మధ్యలో ఉండగా ఉన్నట్లుండి తలెత్తిన లోపాలతో నిలిచిపోవడంతో మధ్యలోని వారు తల కిందికి, కాళ్లు పైకి ఉన్న స్థితిలో గడపాల్సి వచ్చింది. సహాయక బృందాలు రంగంలోకి దిగి , పొడవాటి నిచ్చెనలు అమర్చి వారిని క్షేమంగా కిందికి దింపారు. భయభ్రాంతులై చాలా సేపటివరకూ కోలుకోలేని స్థితిలో ఉన్న వారికి అక్కడి వైద్య సిబ్బంది చికిత్స జరిపింది. రంగులరాట్నం మధ్యలో ఆగిపోవడం, కొందరు తలకిందులై ఉండటం దృశ్యాలు వీడియోగా వైరల్ అయ్యాయి. వీరిని అతికష్టం మీద సురక్షితంగా కిందికి దింపినట్లు, ఇంతవరకూ తమకు ఇటువంటి సహాయక చర్య ఎదురుకాలేదని సహాయక సిబ్బంది తెలిపింది. ఇది తమకు ఓ అనుభవం అంది. అయితే తమకైతే ఇక ప్రాణాలు తలకిందులు అయినట్లు అయిందని ఈ రింగ్‌లో చిక్కుపడ్డ వారు తరువాత తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News